నా బయోపిక్‌లో ఆ హీరో అయితే బాగుంటుంది

shoaib akhtar
shoaib akhtar

కరాచీ: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బయోపిక్‌ల హవా నడుస్తుంది. ఇప్పటికే పలు క్రీడా కారుల బయోపిక్‌లు తెరకెక్కి ప్రదర్శితమయ్యాయి. మరికొన్ని చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. తాజాగా పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ పై కూడా ఓ బయోపిక్‌ వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ యాప్‌ ద్వారా అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తు.. ఒక వేళ తన బయోపిక్‌ రూపొందితే అందులో బాలివుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటించాలని కోరుకుంటున్నట్లు అక్తర్‌ తెలిపాడు. అదే తన చివరి కోరిక అని రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ పేర్కొన్నాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/