నా పేరు సూర్య’ సక్సెస్ మీట్ కి పవర్ స్టార్

PAWAN KALYAN
PAWAN KALYAN

అల్లు అర్జున్ నటించిన ‘నా పేరు సూర్య’ చిత్ర గత శుక్రవారం విడుదలైన సంగతి తెల్సిందే. వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని శిరీష శ్రీధర్ లగడపాటి, బన్నీ వాస్ లు సంయుక్తంగా నిర్మించారు. ఇకపోతే దర్శక నిర్మాతలు ఈ సినిమా యొక్క సక్సెస్ మీట్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. హైదరాబాద్లో ఈ సక్సెస్ మీట్ జరగనుంది. కొద్దిరోజుల క్రితమే జరిగిన రామ్ చరణ్ ‘రంగస్థలం’ సక్సెస్ వేడుకలకి కూడ పవన్ ముఖ్య అతిధిగా హాజరైన సంగతి తెల్సిందే. ఇకపోతే ‘నా పేరు సూర్య’ చిత్ర్రంలో సైనికుడి పాత్రలో అల్లు అర్జున్ ప్రదర్శించిన నటనకిగాను ప్రేక్షకుల నుండి మంచి ప్రసంశలు దక్కుతున్నాయి.