నా కోపానికి ప్రధాన కారణం మోడి ప్రభుత్వం

 

Chandrababu
Chandrababu

కుప్పం: నిన్న ఏఎన్‌ఐ వార్తా సంస్థ తో ప్రధాని నరేంద్ర మోడి ముఖాముఖి నిర్వహించారు అప్పుడు మోడి చేసిన వ్యాఖ్యలపై ఏపి సిఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. ఏపి పట్ల కేంద్రం ప్రవర్తిస్తున్న తీరుపట్ల తప్పకుండా తనకు కోపం, ఆవేశం, బాధ, ఆక్రోశం ఉన్నాయన్నారు. తన కోపానికి ప్రధాన కారణం మోడి ప్రభుత్వం అని ఆయన అన్నారు. ఏపి ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారని అన్నారు. అందుకే కేంద్రంపై తాము పొరాటం చేస్తున్నామని, ఇప్పటివరకు 11 ధర్మపోరాట దీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. బుధవారం చిత్తూరు జిల్లా కుప్పంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఏపి సిఎం చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు పోరాడతానని, వెనక్కి తగ్గే ప్రసక్తేలేదన్నారు. తాను చేస్తున్న పోరాటం తన కోసం కాదని, రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసమేనన్నారు. తెలంగాణలో మహాకూటమి ఓడిపోవడంతో తాను ఆక్రోశంతో ఉన్నానని, దేశంలో పెట్టే మహాకూటమి విజయవంతం కాదని ప్రధాని చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు మండిపడ్డారు.