నాలుగో రోజు పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి పెరిగాయి. వరుసగా నాలుగో రోజు ఆయిల్‌ కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌పై 39 పైసల వరకు పెంచాయి. తాజాగా పెంచిన ధరలతో ఢిల్లీలో పెట్రోల్‌ లీటర్‌కు 88.14కు పెరగ్గా.. డీజిల్‌ రూ.78.38కి చేరింది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.91.65, డీజిల్‌ రూ.85.50కి పెరిగింది. ముంబైలో పెట్రోల్‌ రూ.94.64, చెన్నైలో రూ.90.44, బెంగళూరులో రూ.91.09, జైపూర్‌లో రూ.94.81, పాట్నాలో రూ.90.86, బెంగళూరులో రూ.91.09, డీజిల్‌ లీటర్‌కు ముంబైలో రూ.85.32, చెన్నైలో రూ.85.32, బెంగళూర్‌లో రూ.83.09, జైపూర్‌లో రూ.86.89, పాట్నాలో రూ.83.87, త్రివేండ్రం రూ.84.28కు చేరింది.