నాలుగో పాట ఆవిష్కరణ

SAPTAGIRI LLB
SAPTAGIRI LLB

సాయి సెల్యూలాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ప్రై.సప్తగిరి హీరోగా నిర్మిస్తున్న మరో చిత్రం సప్తగిరి ఎల్‌ఎల్‌బి.. హోమియోపతి వైద్యుడు, నిర్మాత డాక్టర్‌ రవికిరణ్‌ చరణ్‌ లుక్కాకులని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. డైలాగ్‌కింగ్‌ సాయికుమార్‌ , డాక్టర్‌ శివప్రసాద్‌ ముఖ్యపాత్రల్లో నటించిన ఈచిత్రానికి బుల్గానిస్‌ సంగీతం అందించారు. ఈచిత్రంలోని నాలుగోపాటను డైరెక్టర్‌ సుకుమార్‌ ఇటీవల రిలీజ్‌ చేశారు. హీరో సప్తగిరి, డైరెక్టర్‌ చరణ్‌లుక్కాకుల, సంగీత దర్శకుడు బుల్గానిస్‌, నిర్మాత డాక్టర్‌ రవికిరణ్‌ పాల్గొన్నారు. డిసెంబర్‌ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈచిత్రంలో కామెడీ కింగ్‌ సప్తగిరి సరసన కశిష్‌ నోరా హీరోయిన్‌గా నటిస్తోంది.