నాలుగోసారి ర‌ష్యా అధ్య‌క్షుడిగా ఫుతిన్‌

Putin
Putin

మాస్కోః రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమర్‌ పుతిన్‌ మరోసారి ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆయనకు 76.67శాతం ఓట్లు పడినట్లు రష్యా కేంద్ర ఎన్నికల సంఘం నేడు అధికారికంగా వెల్లడించింది. దీంతో మరో ఆరేళ్ల పాటు అంటే 2024 వరకూ ఆయన అధ్యక్షుడిగా కొనసాగుతారు. పుతిన్‌ అధ్యక్షుడిగా ఎన్నికవడం ఇది నాలుగోసారి. రష్యా అధ్యక్ష ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఈ ఎన్నికల్లో 99.8శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పుతిన్‌తో పాటు మరో ఏడుగురు అభ్యర్థులు బరిలోకి దిగారు.