నాలుగు వికెట్లు కోల్పోయిన భార‌త్‌

Virat kohli 1
Virat kohli

సౌతాంప్టన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 142 పరుగుల వద్ద శామ్ కరన్ బౌలింగ్‌లో కోహ్లీ (46) అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అజింక్యా రహనే (11) స్టోక్స్ బౌలింగ్‌లో ఎల్బీ అయ్యాడు. చటేశ్వర్ పుజారా (55), రిషబ్ పంత్ క్రీజులో ఉన్నారు. 47 ఓవర్లు ముగిసే సరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 19/0తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 37 పరుగుల వద్ద లోకేశ్ రాహుల్ (19) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. మరో 13 పరుగులు జోడించిన తర్వాత శిఖర్ ధవన్ (23) కూడా ఔటవడంతో కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. చతేశ్వర్ పుజారాతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఇద్దరూ కలిసి 92 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అర్ధ సెంచరీకి చేరువవుతున్న క్రమంలో కరన్ బౌలింగ్‌లో కుక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కాసేపటికే రహానే కూడా పెవిలియన్ చేరాడు.