నాలుగు నెలల రామాలయంపై ప్రచారం నిలపివేత

VHP
VHP

న్యూఢిల్లీ: విశ్వ హిందూ పరిషత్‌( వీహెచ్‌పీ) అయోధ్యలో రామాలయం నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే తాము కొననాగిస్తున్న ప్రచారని నాలుగు నెలల పాటు నిలిపివేయాలని వీహెచ్‌పీ నిర్ణయించింది. కాగా రాబోయే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వీహెచ్‌పీ ప్రకటించింది.నిరసనలు, ఆందోళనలతో వీహెచ్‌పీ ముందుకు వెళ్లినట్లయితే ఎన్నికల సమయం కాబట్టి ఫలానా పార్టీకి మద్దతుగా ఆందోళన చేస్తున్నారనే అభిప్రాయానికి తావిచ్చినట్టవుతుందని, ఆ దృష్ట్యా రాబోయే నాలుగు నెలల్లో అయోధ్యలో రామాలయ నిర్మాణం డిమాండ్‌పై ఎలాంటి నిరసనలు చేపట్టరాదని నిర్ణయించామని వీహెచ్‌పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ తెలిపారు. అయితే 2019 ఎన్నికలు పూర్తయిన తక్షణమే రామమందిర నిర్మాణం చేపట్టాలని వీహెచ్‌పీ డిమాండ్ చేస్తుందని జైన్ చెప్పారు.