నాలుగునెలల గరిష్టస్థాయికి మార్కెట్లు

b5

నాలుగునెలల గరిష్టస్థాయికి మార్కెట్లు

ముంబై,: బెంచ్‌మార్క్‌ స్టాక్‌ మార్కెట్లు నాలుగునెలల గరిష్టస్థాయికి చేరింది. దేశంలో మొత్తం 17మంది ఆర్థికవేత్తలు రిజర్వుబ్యాంకు తన వడ్డీరేట్లను 25బేసిస్‌ పాయింట్లను తగ్గిస్తుందన్న అంచనాలపై మిశ్రమంగా రావడం కూడా కీలకం అయింది. మొత్తం 17 మందిలో 11మంది వడ్డీరేట్ల ను 25 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తుందని అంచనా. నిప్టీ50సూచి 8800 స్థాయివద్ద మొట్టమొదటిసారి నమోదయింది. ఫార్మా, ఎఫ్‌ఎంసిజి, బ్యాంకింగ్‌ రంగ షేర్లు భారీ వృద్ధిని సాధించాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 28,439 పాయింట్లవద్ద స్థిరపడింది. 199 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 50సూచి 8801 పాయింట్లవద్ద నిలిచింది. 60 పాయింట్లుపెరిగింది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌సూచీలు కూడా 1.1 శాతం 0.9శాతం మేర పెరిగాయి. సన్‌ఫార్మా, ఐసిఐసిఐబ్యాంకు, అదానిపోర్టులు హిందూస్థాన్‌ యూనిలీవర్‌ వంటివి సెన్సెక్స్‌లో టాప్‌ గెయినర్లు గా నిలిచాయి. డా.రెడ్డీస్‌, సిప్లా, ఒఎన్‌జిసి వంటి సంస్థలు వెనకబడ్డాయి. బిఎస్‌ఇ రియాల్టీ సూచీ 1.9శాతం పెరిగింది. బ్యాంకింగ్‌స్టాక్స్‌ 1శాతం పెరి గింది. ఐసిఐసిఐబ్యాంకు, యాక్సిస్‌బ్యాంకులు 3.14శాతం, 1.65శాతం పెరిగింది. వడ్డీరేట్లపై కోత ఉంటుందన్న అంచనాలే కీలకం. లూపిన్‌ కంపెనీ నాలుగుశాతం పెరిగింది. అమెరికా ఎఫ్‌డిఎ ఆమోదం లభించడమే కీలకం. కంపెనీ స్టాక్‌ 0.5 శాతం గరిష్టంగా మిగిలింది. ఇతరత్రా డా.రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ 3.14శాతం దిగజారింది. నికర లాభాల్లో 16శాతం దిగజారాయి. యూరోపియ న్‌ మార్కెట్లు దిగువనస్థాయిలోనే ముగి సాయి. యూరోపియన్‌ స్టాక్స్‌600 0.32శాతం దిగు వన ప్రతికూలంగానే ముగిసాయి. ఆసియా మార్కెట్లు సోమవారం గరిష్టంగా ముగిసాయి. వాల్‌స్ట్రీట్‌ ఆర్థికఫలితాలతో 100మేజర్‌ కంపెనీ లు పటిష్టం అయ్యాయి. ఆసియాపసిఫిక్‌షేర్లు జపాన్‌బయటి ప్రాంతంలో 0.4శాతం పెరిగా యి. తైవాన్‌ మార్కెట్‌ షేర్లు 0.9శాతం ముగి సాయి. జపాన్‌ నిక్కీ 0.2శాతంపెరిగింది. జపాన్‌ప్రధాని షింజో అబే అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ట్రంప్‌ను ఈనెల 10,11తేదీల్లో కలు స్తున్నట్లు వార్తలు వెలువడటమే ఇందుకుకీలకం. వాణి జ్యం, కరెన్సీ అంశాలే చర్చల అజెండా అని తేలింది.