‘నారూటే సపరేటు’ పోస్టర్‌ విడుదల

Naa rootae separate-22
Naa rootae separate-

‘నారూటే సపరేటు’ పోస్టర్‌ విడుదల

ఆలీరాజా, మధుమిత కృష్ణ జంటగా నటిస్తున్న చిత్రం ‘నా రూటే సెపరేటు. ఐశ్వర్య అడ్డాల మరోనాయిక.. జెన్నీఫర్‌ ప్రత్యేక గీతంలో కన్పిస్తుంది.. గిరిధర్‌ దర్శకత్వంలో భరధ్వాజ్‌ సినీ క్రియేషన్స్‌ పతాకంపై ఎం.సుబ్బలక్ష్మి నిర్మిస్తున్నారు.. చిత్రీకరణ పూర్తయింది. వచ్చే నెలలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.. ఈసందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్రం పోస్టర్‌ను విడుదల చేశారు.
అనంతరం దర్శకుడు గిరిధర్‌ మాట్లాడారు.. ఈజీమనీ నేపథ్యంలోసాగే చిత్రమిదని అన్నారు. నేటితరం యువత ఈజీ మనీ కోసం ఏ మార్గాన్ని ఎంచుకుంటోంది..ఎలాంటి సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటోంది . ఏ విధంగా మళ్లీ దారిలోకి వస్తున్నారు అన్నది ఈచిత్రంలో ప్రధానాంశంగా చెప్పారు.. కథ, కథనం ఆసక్తికరంగా ఉంటుందని, పూర్తిస్థాయి వినోదాన్ని పంచే చిత్రమిదని అనానరు. అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని అన్నారు.
నిర్మాత వామనరావు మాట్లాడుతూ, షూటింగ్‌ పూర్తయిందని, నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. త్వరలో పాటల్ని విడుదల చేసి వచ్చేనెలలో సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.. హీరోయిన్‌ మధుమిత కృష్ణ మాట్లాడుతూ, లజ్జ తర్వాత నటనకు ఆస్కారమున్న పాత్రలో నటించానని తెలిపారు. ఆలీ, జెన్నీఫర్‌, వినోద్‌, ప్రసాద్‌బాబు, శేషు వెంకీ తదితరులు నటిస్తున్నారు.