నారా లోకేష్ కాన్వాయ్‌కి ప్ర‌మాదం!

Lokesh
Lokesh

నెల్లూరుః రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ కాన్వాయ్‌‌లో మంగళవారం ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లా మేర్లపాక గ్రామం దగ్గర మంత్రి కాన్వాయ్‌లోని రెండు వాహనాలు ఢీకొన్నాయి. దీంతో వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అనంతరం పోలీసులు మంత్రిని క్షేమంగా వేరే వాహనాల్లో తిరుపతికి తరలించారు. కాగా… కాన్వాయ్‌లో ప్రమాదం జరగడంతో అధికారులు, తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమైంది. పలువురు నాయకులు, మంత్రులు కాన్వాయ్‌లోని అధికారులు, నెల్లూరు జిల్లా పోలీస్ అధికారులకు ఫోన్లు చేసి ఆరా తీయడం కనిపించింది.