నారా రోహిత్‌ కొత్త చిత్రం

nara rohit
nara rohit

రొటీన్‌కు భిన్నంగా వైవిధ్యమైన కథ, కథనాలను ఎంచుకుంటూ కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ సొంతం చేసుకున్న నారా రోహిత్‌ తాజాగా ఇఎంవిఇ స్టూడియోస్‌ సంస్థలో సినిమా సైన్‌ చేశారు. ప్రొడక్షన్‌ నెం: 3గా ఇఎంవిఇ స్టూడియోస్‌ సంస్థ నిర్మిచంనున్న ఈచిత్రం ద్వారా ఎస్‌డి చక్రవర్తి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వైవిధ్యమైన కథతో విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈచిత్రం రెగ్యులర్‌ షేటింగ్‌ మార్చి నుంచి మొదలు కానుంది. వడ్డేపల్లి సత్యనారాయణ సమర్పణలో రూపొందనున్న ఈచిత్రంలో నారా రోహిత్‌ క్యారెక్టరైజేషన్‌, గెటప్‌ చాలా టిపికల్‌గా ఉండబోతున్నాయి.
ప్రస్తుతం తమ ప్రొడక్షన్‌లో రూపొందిన హౌరా బ్రిడ్జి విడుదలలో బిజీగా ఉన్న నిర్మాణ బృందం. సినిమా రిలీజ్‌ కాగానే నారా రోహిత్‌ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నారు. ఈచిత్రానికి సంగీతం: సాయికార్తీక్‌ అందిస్తున్నారు.