నాయకుల్ని లాక్కోవడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య

byreddy rajasekhar reddy
byreddy rajasekhar reddy

కర్నాలు: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని ప్రధానిని చేస్తామని కాంగ్రెస్‌ నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతు రాహుల్‌, ప్రియాంకను కర్నూలుకు తీసుకువస్తామని తెలిపారు. కోట్ల కాంగ్రెస్‌ను వీడినా పార్టీకి నష్టం లేదని, జిల్లాలో పార్టీ పటిష్టంగా ఉందని పేర్కొన్నారు. ఇతర పార్టీల నుంచి నాయకుల్ని లాక్కోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని వ్యాఖ్యానించారు. జిల్లాలో రెండు పార్లమెంటు, 14 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ చేస్తుందని బైరెడ్డి వెల్లడించారు.