నాగ చైతన్యను సరికొత్త గెటప్లో చూపించబోతున్నా

chaitu
chaitu

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం ‘సవ్యసాచి’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చైతన్యతో కలిసి ‘ప్రేమమ్’ వంటి హిట్ సినిమాను రూపొందించిన దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవలే మొదలైన ఈ చిత్రం ఒక షెడ్యూల్ ను కూడా ముగించేసుకుంది. సినిమా ఔట్ ఫుట్ కూడా చాలా బాగా వస్తోందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

అంతేగాక ఇందులో నాగ చైతన్యను సరికొత్త గెటప్లో చూపించబోతున్నామని, సినిమా సవ్యసాచి అనే టైటిల్ కు న్యాయం చేసే విధంగా ఉంటుందని, ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలు ప్రత్యేకంగా నిలుస్తాయని అంటున్నారు చందూ మొండేటి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి స్వరాలు సమకూరుస్తుండటం విశేషం.