నాగ్‌ కొత్తకారు..

Nagarjuna in Rta Office in Hyd
Nagarjuna in Rta Office in Hyd

మన్మథుడు.. కొత్తకారు..

టాలీవుడ్‌ మన్మథుడు నాగార్జున అక్కినేని కొత్త కారు కొన్నారు.. అదికూడ తన 57వ జన్మదినోత్సవాన్నిపురస్కరించుకుని ఆయన ఆ కారును కొన్నారట.. దాదాపు రూ.1.87కోట్లుపెట్టి కొన్న ఆ కారు ఏ కంపెనీదనుకుంటున్నారు.. ఇంకే కంపెనీ రాజసం ఉట్టిపేడలా లగ్జరీ కార్లను తయారు చేస్తున్న బిఎండబ్ల్యూ కంపెనీదే కొన్నారు.. బిఎండబ్ల్యూ 7 సిరీస్‌ 750 ఎల్‌ ఐఎక్స్‌ డ్రైవ్‌ స్టోర్స్‌ (2016) మోడ్‌కుచెందిన కారులో అన్నీ ప్రత్యేకతలేనట.. బ్లూకలర్‌లో మెరిసిపోతున్న ఈ కారు రిజిస్ట్రేషన్‌ కోసం నాగ్‌..శుక్రవారం ఉదయం ఖైరతాబాద్‌లోని ఆర్టీఎ కార్యాలయానికి స్వయంగా వచ్చారు.. రిజిస్ట్రేషన్‌లో భాగంగా కౌంటర్‌ వద్ద ఫొటో దిగిన నాగ్‌..నిబంధనల మేరకు డిజిటల్‌సంతకం చేశారు.. నాగ్‌ కారుకు ఆర్టీఎ అధికారులు ‘టిఎస్‌ 09 ఇక్యూ 9669నెంబరు కేటాయించారు. రిజిస్ట్రేషన్‌ కోసం ఆర్టీఎ కార్యాలయానికి వచ్చిన నాగ్‌నుచూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.. నాగ్‌తోసెల్ఫీల కోసం పోటీలు పడ్డారు.. దీంతో అక్కడ సందడి వాతావరణ నెలకొంది.