నాగరికతా.. నీ పయనం ఇదేనా

CHELI
Spl Story Photo

నాగరికతా.. నీ పయనం ఇదేనా

పారే సెలయేరు ఎంత స్వచ్ఛంగా, అహ్లాదంగా వ్ఞంటుందో కోమలి నవ్ఞ్వ కూడా అంతే మధురంగా వ్ఞంటుంది. పేరుకు తగ్గట్టు అందమైన ముఖం ఆమెది. అమాయత్వం, చిలిపినవ్ఞ్వ ఆమె సంపద. కానీ అంత రంగంలో ఆమెలో మెదిలే ఆలోచ నలు జ్ఞానపుభాండాగారం. లోతైన మనసులో ఎన్ని ఆలోచనలు ఎన్నెన్ని ఆశయాలు ఉన్నాయో గ్రహిస్తే ఆశ్చర్యమనిపిస్తుంది. పట్టుదల, కసి, ఏదో సాధించాలనే తపన ఆమెను వెంటాడుతుంటాయి.

ఆడపిల్ల అనే భావన అడుగడుగునా నిరాశ, కృంగ దీసే సన్నివేశాలు, సంఘట నలు ఎదురౌతున్నా వాటిని అధిగమిస్తున్న ఆమె తీరు అభినందనీయమే. చదువే ఆమె ధ్యాస, ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలనే కోరిక ఇప్పటిది కాదు. బాల్యపు సన్నివే శాలు ఆమెను ఆ దిశగా ఆలోచింపచేసింది. కోమలి క్లాస్‌ టీచర్‌ అంటే ఆమెకు ఎంతో ఇష్టం.ఎంతని అడిగితే మాటలతో చెప్పలేని అభిమానం ఆమెది. కారణం ఆ టీచర్‌ ఆదర్శానికి నిలయం. క్రమశిక్షణకు మారుపేరు. చదువ్ఞలో ఆ టీచర్‌ ప్రోత్సహించే తీరు అద్భుతం. అన్నింటికి మించి ఆమె పెళ్లి చేసుకో లేదు. పిల్లల్ని దేశానికి ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ఏకంగా తన జీవితాన్నే త్యాగం చేసింది. పెళ్లి, పిల్లలు ఇవన్నీ తనలో స్వార్థం పెంచు తాయని భావించి, సున్నితంగా పెళ్లి అనే జీవితం పేజీని తెరవలేదు ఆ టీచర్‌.

అలా ఆమె టీచర్‌ వృత్తికే అంకితమైపోయింది. తెలివైన పిల్లల్ని తీర్చిదిద్దడం ఎవరికైనా సులభమే. స్కూళ్లు, కాలేజీలు ర్యాంకుల మోజు లోపడి టాపర్లను, తెలివైన విద్యార్థులను ఎంపిక చేసి, వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపి, చదువ్ఞలో టాప్‌ర్యాంకర్లుగా చేయడం పరిపాటే. కానీ కోమలి టీచర్‌ దీనికి భిన్నంగా ప్రవర్తించేది. చదువ్ఞలో వెనుకంజలో వ్ఞండి, కొన్ని పరిస్థితుల వల్ల అందులో రాణించలేని పిల్లలే ఆమె టార్గె ట్‌. వారిని ఎంపిక చేసుకుని, తన ఇంటికి పిలిపించు కుని, చదువ్ఞలో ప్రోత్సహించడం ఆరంభించింది. ఇందులో కోమలి కూడా ఉంది. చదువ్ఞ లో వెనకంజలో వ్ఞన్న కోమలి, పదోతరగతి 500పైగా మార్కులను పొందింది. దీంతో ఆ టీచర్‌నే ఆదర్శంగా తీసుకుని, ఆమె ఆశయాలను నెరవేర్చేందుకు తనవంతు కృషి చేయడం ఆరంభించింది. ఉన్న పల్లెటూరులోనే ఇంటర్‌ చదివి, ఆపై ఉన్నతమైన చదువ్ఞ కోసం కోమలి నగరానికి వచ్చింది.

ఒక పేరున్న కళాశాలలో ఇంజినీరింగ్‌లో చేరింది. నగరమం తా ఆమెకు కొత్త. పల్లెలు కూడా టెక్నాలజీలో ఏమాత్రం తీసిపో కుండా అభివృద్ధి చెందుతున్నా ఎందుకనో కోమలికి నగరం వాతా వరణం అస్సలు నచ్చలేదు. సినిమాలు వేరు జీవితం వేరు అని అనుకునే కోమలికి నగరం వచ్చాక కానీ అర్థం కాలేదు. నగరం, సినిమా రెండూ వేరు కాదని, ఒక్కటేనని గ్రహించేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. కారణం అబ్బాయిలు, అమ్మాయిలు ప్రవర్తించే తీరు కోమలికి ఏమాత్రం నచ్చలేదు. నాగరికత ముసుగులో యువత ఎంతగా పెడదోవలో పడుతు న్నదో గమనించి, ఆవేదనకు గురయ్యిం ది. కాలేజీ బస్సు అంటే అది కళాశాలకు వెళ్లే బస్సుగా అనిపించ లేదు. ఏదో పిక్‌నిక్‌కు వెళ్తున్నట్లుగా అనిపించింది. ఆడమగ అనే తేడా లేకుండా కలిసి డ్యాన్స్‌ వేయడం, కలిసి ఒకే బాక్సు పంచుకుని తినడం, ఒకరికి ఒకరు నోట్లో పెట్టుకో వడం, కొట్టుకుంటూ మాట్లాడుకోవడం, ఒకరిపై ఒకరు వాలిపోతూ జోక్స్‌ వేసుకోవడం, సెల్ఫీలు తీసుకోవడం..వంటివాటిని చూసి అవాకై పోయింది. సినిమా ఎక్కడో లేదు, ఇక్కడే షూటింగ్‌ జరుగుతుంది అన్న భావన కోమలిలో కలిగింది.

ఇక బర్త్‌డేపార్టీల సంగతి చెప్పనక్కరలేదు. ఈమధ్య హైదరాబాద్‌కు చెందిన ఒక ఇంజినీరింగ్‌ విద్యార్థి తన బర్త్‌డే సందర్భంగా స్నేహితులకు ఒక హోటల్‌లో పార్టీ ఇచ్చాడు. అక్కడ మద్యం సేవించాడు. సేవించడమే కాదు తాగినమైకంలోనే కారును డ్రైవింగ్‌ చేశాడు. తద్వారా ఆ మత్తులో వేగంగా నడుపుతూ, యాక్సిడెం ట్‌కు గురిచేశాడు. తద్వారా ఇంజినీరింగ్‌ చదువ్ఞతున్న ఒకమ్మాయి మరణించింది. మిగిలిన వారు గాయపడ్డారు. మద్యం సేవించి, కారు నడిపి, యాక్సిడెంట్‌కు కారణమైన ఆ వ్యక్తిని, మరొక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇదేమీ సంస్కృతి? పుట్టినరోజు అంటే హోటల్‌లో పార్టీ చేసుకోవడం తప్పు కాదు. అక్కడ స్నేహితులతో విందు చేయడం కూడా తప్పు కాదు. కానీ మద్యం, ఇతర మత్తుపదార్థాలను సేవించి, వాహనా లను నడపడం, అర్థ రాత్రులు ఇంటికి చేరుకోవడం ఎక్కడ నుంచి నేర్చుకున్న సంస్కృతి ఇది?… జరిగిన ఈ సంఘటన న్యూస్‌ చానళ్లు, వార్తాపత్రికల ద్వారా తెలుసుకున్న కోమలికి మతిపో యింది.

తనకు తెలిసినంతవరకు బర్త్‌డే అంటే స్నేహితులను ఇంటికి పిలిచి, వారికి భోజ నం పెట్టడం, తల్లిదం డ్రుల కాళ్లను మొక్కి, వారిని గౌరవించడం, ఇష్ట మైన దేవాలయానికి వెళ్లడం..అంతా హుందాగా జరిగిపోయే ఆ సన్నివేశాన్ని కోమలి గుర్తు చేసుకుని, కన్నీళ్లపర్యంతం అయ్యింది. కాలం మారింది, ఇదంతా కొత్త ట్రెండ్‌ అని ఎంత అనుకుంటే మాత్రం దేనికైనా కొన్ని పరిమితులు వ్ఞంటాయనే ఆమాత్రం స్పృహలేకపోతే ఎలాగ? అసలు హుందాతనం అనే భావనకే చోటులే కుండా అంతా టూమచ్‌గా ప్రవర్తిస్తూ, ఇదంతా న్యూకల్చర్‌ అనుకుంటే సరిపోతుందా? ఈ ప్రవా హంలో మనం సాధిస్తున్న ప్రగతి ఏంటి? ఆనందాలు, కేరింతలు, చిలిపి గొడవలు ఏవైనా మర్చిపోలేని మధురమైన జ్ఞాపకాలుగా మిగలా లేకాని, అదొక వికృత కల్చర్‌ అనుకుంటూ, జీవితాంతం బాధపడేలా ప్రవర్తిం చడం కోమలికి అస్సలు నచ్చలేదు.
నాలుగేళ్లు నేను ఇక్కడ చదువు కుంటే ఇలాగే మారి పోతానేమో అన్న అనుమానం ఆమెలో కలిగింది. వెంటనే సూట్‌కేస్‌ సర్దుకుని, తన సొంత గ్రామానికి వెళ్లిపోయింది. పట్నం, నగరం అభివృద్ధి చెందింది అంటే ఆర్థికంగా, సామాజి కంగా, నైతికంగా, విద్యా, ఉపాధిలో అన్నింట్లో వృద్ధి చెందిందని అనుకున్న కోమలికి ఈ అభివృద్ధి అంతా నాణెనికి ఒకవైపు మాత్రమేనని, రెండోవైపు అనైతికం, అక్రమం, మోసం, అన్యా యం దాగుందని గ్రహించి, కుమిలిపోయింది. నిజమే నగరాలు, పట్టణాల్లో యువత మత్తుమందుకు, మత్తు పదార్థాలకు బానిసలుగా మారిపోతు న్నారు. ఈమధ్య ఇంటర్నెట్‌ సెంటర్లపై పోలీసులు కొన్ని దాడు లు చేసినప్పుడు 16 సంవత్సరాల పిల్లలు అశ్లీల దృశ్యాలు చూస్తూ, దొరికిపోయా రు. వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి, పంపించారు.

ఇవన్నీ గ్రామా ల్లో కూడా ఉన్నాయి. కానీ ఇంత విచ్చల విడిగా మాత్రం లేదనేది వాస్తవం. నగరాల్లో, పట్టణాల్లో మంచి విద్యతో పాటు ఉపాధికి లోటు లేదు. తద్వారా యువత తమ గ్రామాలను, పట్టణాలను వదిలేసి, నగరాలకు వస్తున్నారు. కానీ ఇక్కడ కొంతమంది స్వార్థ పరులు అక్రమ సంపాదనే ధ్యేయంగా పెట్టుకుని, యువతను పెడద్రోవ లో నడిపిస్తున్నారు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని, వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. సెల్‌ఫోన్ల వాడకం అధికం అయ్యేకొద్ది అంతా ఆన్‌లైన్‌మయం కావడం తో విచ్చలవిడితనం రిగి పోతున్నది. ఏది చేసినా, పిల్లల భవిష్యత్తు బాగుండాలనే తపన తోనే చేస్తున్నాం కావ్ఞన, వారి కెరీర్‌ బాగుండా లనే ఆశతో సమయాన్ని కేటాయించడం ప్రాముఖ్యమైనది గ్రహించి, ఆ దిశగా వారి ఉన్నత జీవితానికి కృషి చేద్దాం.