నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

stock exchange
stock exchange

ముంబై: స్టాక్‌మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 200 పాయింట్లకు నష్టపోగా నిఫ్టీ 11,000 పాయింట్లు దిగువకు పడిపోయింది. వివిధ రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు తర్వాత స్వల్పంగా లాభాలను నమోదు చేశాయి. కానీ తర్వాత మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లిపోయాయి. చివరకు సెన్సెక్స్‌ 218 పాయింట్లు నష్టపోయి 36324 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.59 వద్ద కొనసాగుతుంది.