నష్టాల్లో దేశీయ మార్కెట్లు

stock exchange
stock exchange

ముంబై: దేశీయ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణం నేపథ్యంలో గత శుక్రవారం భారీ నష్టాలను చవిచూపిన సూచీలు, సోమవారం కూడా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. పీఎన్‌బి స్కాం కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టాల్లో ఉండటం మార్కెట్‌ సెంటిమెంట్‌నున దెబ్బతీసింది. దీంతో సూచీలకు నష్టాలు చవిచూశాయి. చివర్లో ఐటి, ప్రైవేట్‌ బ్యాంకులు పుంజుకోవడంతో సూచీలు కాస్త కోలుకున్నప్పటికీ నష్టాల్లో ముగిశాయి. సోమవారం నాటి ట్రేడింగ్‌లో 236 పాయింట్లు కోల్పోయిన సూచీ, 33,775 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 74 పాయింట్ల నష్టంతో 10,378 వద్ద స్థిరపడింది.