నష్టాలను మూటగట్టుకున్న మార్కెట్లు

stock
stocks

ముంబై: మార్కెట్లపై చివరి వరకు అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. సోమవారం ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 368 పాయింట్లు నష్టపోయి 35,656 వద్ద, నిఫ్టీ 119 పాయింట్లు నష్టపోయి 10,661 వద్ద ముగిశాయి. ముఖ్యంగా ఐసిఐసిఐ బ్యాంక్‌ వరుసగా ఎనిమిదో ట్రేడింగ్‌ సెషన్‌లో కూడా నష్టాలను మూటగట్టుకుంది. రిలయన్స్‌, హెచ్‌డిఎఫ్‌సి, బజాజ్‌ ఫైనాన్స్‌లు నష్టపోయాయి. టిసిఎస్‌, ఎల్‌ అండ్‌ టి, కోల్‌ ఇండియాలు లాభపడ్డాయి.