నవాజ్‌ షరీఫ్‌ ఆరోపణలు అవాస్తవం

NAWAZ SHAREEF
NAWAZ SHAREEF

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌మాజీ ప్రధాని నవాజ్‌షరీఫ్‌చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, తప్పుదారిపట్టించేవిగా ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. జియో టివి ఈమేరకు ప్రత్యేక కథనం న్రపచురించింది. పాకిస్తాన్‌కుచెందిన జాతీయరక్షణ కమిటీ (ఎన్‌ఎస్‌సి) సోమవారం సమావేశం అయిందని, ప్రధాని షాహిద్‌ఖఖన్‌ అబ్బాసి అధ్యక్షతన జరిగిన సమావేశంలోషరీఫ్‌ తప్పుదారిపట్టించేవిధంగా మీడియాలోప్రకటనలిచ్చినట్లు వెల్లడించారు. తర్వాతన్రపధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదలచేస్తూ నవాజ్‌షరీఫ్‌ప్రకటనలు దురదృష్టకరమని, నిర్దిష్టమైన ఆధారాలు, రుజువులు ఉంటే ప్రకటనలు చేయాలేకాని నిరాధారమైన ఆరోఫణలు చేయకూడదని పేర్కొన్నది. షరీఫ్‌ మొట్టమొదటిసారిగా మిలిటెంట్‌ సంస్థలు పాకిస్తాన్‌లోచురుకుగా పనిచేస్తున్నాయని ప్రభుత్వేతర వ్యక్తులు సరిహద్దులు దాటుకునివెళ్లి ముంబైలో ప్రజలనుచంపుతున్నారని అన్నారు. 150మందిని ముంబైలో చంపింది ఎవరు. మనం ఆకేసు విచారణను ఎందుకు పూర్తిచేయకూడదు అని డాన్‌ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. 2008లో ముంబైలోజరిగిన దాడుల్లో పాకిస్తాన్‌ప్రమేయంఉందనడానికి ఈ వ్యాఖ్యలు సాక్ష్యాలుగా నిలిచాయి. అయితే ఆయన పార్టీ పాకిస్తాన్‌ముస్లింలీగ్‌-ఎన్‌ వివరణ ఇస్తూ నవాజ్‌ షరీఫ్‌ వ్యాఖ్యలను భారత మీడియా వక్రీకరించిందని పేర్కొన్నది. అంతర్జాతీయంగాను, స్థానిక మీడియాలోసైతం కొంత వాడివేడి వార్తలు రావడంతో ఎన్‌ఎస్‌సి సమావేశం అత్యవసరంగా కొనసాగించారు. ఉన్నతస్థాయి మిలిటరీ నాయకులు, విదేశాంగమంత్రి, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అబ్బాసి నివాసంలో ఈ క్రియాశీలక సమావేశం జరిగింది.కమిటీలో పాల్గొన్న ప్రముఖులందరూ షరీఫ్‌ వ్యాఖ్యలు నిరాధారమని ఖండించారు. లష్కరేతాయిబాకు చెందిన పదిమంది ఉగ్రవాదులు కరాచినుంచి ముంబైకు 2008 నవంబరులో ప్రయాణించి ఒక టీమ్‌ గా ఏర్పడి దాడులునిర్వహించి మొత్తం 166 మందిని కాల్చిచంపడంతోపాటు 300 మందికి తీవ్ర గాయాలు కలిగించారు. తొమ్మిది మంది ఉగ్రవాదులను పోలీసులుకాల్చి చంపారు. సజీవంగా పట్టుబడిన అజ్మల్‌కసబ్‌ను విచారించిన తర్వాత ఆయనకు మరణశిక్షను అమలుచేసిన సంగతి తెలిసిందే. ఈదాడులవెనుక పాకిస్తాన్‌ కేంద్రంగాపనిచేస్తున్న జమాత్‌ ఉద్‌ దవా చీఫ్‌ హఫీజ సయీద్‌ కీలకపాత్ర ఉన్నట్లు దర్యాప్తుసంస్థలుప్రకటించాయి. అయితే ఈ దాడుల విచారణకేసు పదో సంవత్సరంలోఉ ంది. పాకిస్తాన్‌ ఇప్పటికీ ఈ నిందితుల్లో ఎవ్వరినీ శిక్షించలేకపోతోంది.