నవాజ్‌ షరీఫ్‌కు చుక్కెదురు

Nawaz Shareef
Nawaz Shareef

ఇస్లామాబాద్‌: పనామా పత్రాల కేసులో అనర్హత వేటుపడి ప్రధాని పదవితో సహా పార్టీ అధ్యక్ష పదవి కోల్పోయిన నవాజ్‌షరీఫ్‌కు చుక్కెదురైంది. పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌లో ఎన్‌ పేరు కోల్పోయే ప్రమాదం ఉంది. సుప్రీం కోర్డు ద్వారా అనర్హతకు గురైన వ్యక్తి పేరుపై రాజకీయ పార్టీ ఉండరాదంటూ అవామీ తెహ్రీక్‌ నేత దాఖలు చేసిన ఫిర్యాదుపై మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 9న హాజరుకావాలని లాహోర్‌లో ఆయన నివాసానికి పంపిన నోటీసులో పేర్కొంది. వచ్చే నెల 25వ తేదీన ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈసీ నోటీసులు పంపడం ప్రాధన్యాం సంతరించుకుంది. అనర్హత వేటు పడిన తర్వాత కూడా పార్టీ ఛైర్మన్‌గా నవాజ్‌ కొనసాగేలా పీఎంఎల్‌ఎన్‌ రాజ్యాంగ సవరణ చేపట్టగా ప్రతిపక్ష పార్టీలు సుప్రీం కోర్టులో సవాలు చేశాయి. రాజ్యాంగంలో ఆర్టికల్‌ 62,63 ప్రకారం అనర్హంత వేటు పడిన వ్యక్తి పార్టీ అధ్యక్షునిగా కొనసాగరాదంటూ సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.