నవమి అల్లర్లపై అమిత్‌షా కమిటీ

SRI RAMA NAVAMI CLASHES IN WEST BENGAL
SRI RAMA NAVAMI CLASHES IN WEST BENGAL

న్యూఢిల్లీ: శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా పశ్చిమబెంగాల్‌లోని అసాన్సోల్‌లో చెలరేగిన హింసాకాండపై బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా పార్టీ సీనియర్‌ నేతలతో కూడిన నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సభ్యులు బెంగాల్‌లో పర్యటించి ఒక నివేదికను ఆయనకు సమర్పిస్తారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు ఓం మాథుర్‌, ప్రతినిధి షాన్వాజ్‌ హుస్సేన్‌ ,ఎంపిలు రూపా గంగూలీ, బిడి రామ్‌ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.