నవమికి భద్రాచలం విచ్చేయనున్న సియం

TS CM KCR
TS CM KCR

భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ సియం కేసిఆర్‌ ఈనెల 26 న తేదీన భద్రాచలానికి విచ్చేయనున్నారు. 26న శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం జరగనుంది. ఐతే సియం హోదాలో ప్రభుత్వం తరఫున కేసిఆర్‌ సీతారాములకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. అలాగే 27న శ్రీ రామ పట్టాభిషేకానికి గవర్నర్‌ నరసింహన్‌ హాజరు కానున్నారు. ఇదిలా ఉండగా నవమికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.