నవంబర్‌ 3న పిఎస్‌వి గరుడవేగ 126.18 ఎం

GARUDA VEGA
GARUDA VEGA

నవంబర్‌ 3న పిఎస్‌వి గరుడవేగ 126.18 ఎం

తెలుగు చలనచిత్రాల్ల నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజన్సీ (ఎన్‌ఐఎ)పై ఇప్పటి వరకు సినిమాలు రాలేదు.. ఓ సిన్సియర్‌ ఎన్‌ఐఎ ఆఫీసర్‌ దేశం కసం, తన కుటుంబం కోసం ఏం చేశాడనే కథాంశంతో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ పిఎస్‌వి గరుడవేగ ..పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌ పాత్రలకు పెట్టింది పెరైన యాంగ్రీ యంగ్‌మెన్‌ డాక్టర్‌ రాజశేఖర్‌ హీరోగా సినిమా రూపొందనుంది.. మంచి కథ, పవర్‌ఫుల్‌ హీరోయిజం, హృదయాన్ని తాకే ఎమోషన్‌స , ఉత్కంఠ రేపే సన్నివేశాలతో సినిమాను దర్శకుడు ప్రవీణ్‌సత్తారు తెరకెక్కించారు.. మగాడు , అంత పవర్ఫఉల్‌ రోల్‌లో రాజశేఖర్‌ను ప్రెజెంట్‌ చేయాలని దర్శకుడు పడ్డ తపన సినిమా రూపంలో కనపడనుంది.
జ్యో స్టార ఎంటర్‌ప్రైజెస్‌ బ్యానర్‌పై రూ.25 కోట్ల భారీ బడ్జెట్‌తో కోటేశ్వర్‌రాజు నిర్మించిన ఈచిత్రంలో రాజశేఖర్‌ సరికొత్త లుక్‌లో కన్పించనున్నారు.. రీసెంట్‌గా విడుదలైన సినిమా టీజర్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ క్రియేట్‌ చేసింది.. నిర్మాత మాట్లాడుతూ, గరుడవేగ సినిమా దేనికదే ప్రత్యేకంగా ఉంటుందన్నారు.. హీరోయిన్‌ పూజాకుమార్‌ ఇందులో గృహిణిపాత్రలో కన్పించనున్నారని అన్నారు.. అదిత్‌ అరుణ్‌ కీలకపాత్రలో నటించాడని అన్నారు. శ్రద్ధాదాస్‌ ఇన్వెస్టిగేషన్‌ జర్నలిస్ట్‌ పాత్రలో కన్పించనుందని తెలిపారు.. కిషోర్‌ మెయిన్‌ విలన్‌గా నటిస్తున్నారని అన్నారు.. ఈచిత్రాన్ని నవంబర్‌ 3న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.