నల్ల ఉప్పుతో చర్మ సౌందర్య సంరక్షణ

అందమే ఆనందం

Skin care with black salt
Skin care with black salt

చర్మ సౌందర్యాన్ని పెంచే గుణాలు నల్ల ఉప్పులో బోలెడు ఉన్నాయి .. అవేంటంటే.. నల్ల ఉప్పు చర్మాన్ని స్మూక్ష క్రిముల నుంచి కాపాడుతుంది.. శిరోజాలకు నల్ల ఉప్పును పట్టిస్తే.. నల్లగా నిగ నిగ లాడుతాయి. ఆరోగ్యంగా ఉంటాయి.

పాదాల వద్ద చర్మం పగుళ్లు ఏర్పడి ఇన్ఫెక్షన్ బారిన పడతాయి.. దీంతో పాదాలు బాగా నొప్పి పెడుతుంటాయి.. అలాంటప్పుడు సగం బకెట్ నీళ్లలో కాస్త నల్ల ఉప్పు వేసి ఆ నీటిలో పాదాలను 15 నిముషాలు ఉంచాలి.. తర్వాత పాదాలను బయటకు తీసి సున్నితంగా స్క్రబ్ చేయాలి.. ఇలా చేయటం వలన పాదాలు సాంత్వన పొందుతాయి..

నల్ల ఉప్పు సహజసిద్ధమైన స్క్రబ్బర్. శీతాకాలం లో కొద్దీ నల్ల ఉప్పును చర్మంపై సున్నితంగా రుద్ది నీటితో శుభ్రం చేసుకుంటే మొటిమలు, బ్లాక్ హెడ్స్ రావటం , చర్మం పొడి భారతం వంటి సమస్యలు తలెత్తవు..
చుండ్రు సమస్యకు నల్ల ఉప్పు బాగా పనిచేస్తుంది.. జుట్టుకి నల్ల ఉప్పు రుద్దుకుని 10 నిముషాల అయ్యాక కడుక్కుంటే చుండ్రు సమస్య తగ్గిపోతుంది.

ఆరోగ్య సంబంధిత వ్యాసాల కోసం ‘స్వస్థ’ క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/specials/health/