నల్లారి కిశోర్‌ టిడిపి చేరికపై సాయిప్రతాప్‌ స్పందన

sai pratap
sai pratap

అమరావతి: ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు నల్లారి కిశోర్‌ కుమార్‌రెడ్డి టిడిపిలో ప్రవేశించిన సంగతి అందరికీ తెలిసిందే. దీనిపై రాజంపేట టిడిపి పార్లమెంటరీ ఇన్‌ఛార్జ్‌ ,కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్‌ స్పందిస్తూ చిత్తూరు జిల్లాలో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉన్న నల్లారి కుటుంబానికి చెందిన కిశోర్‌ టిడిపిలో చేరడం చాలా సంతోషకరమని చెప్పారు. కిశోర్‌ టిడిపిలో చేరే కార్యక్రమానికి తాను రాలేకపోయాయని తెలిపారు.