నరసింహన్‌, గవర్నర్‌ పదవికే కళంకం

Nakka Anandbabu
Nakka Anand babu

అమరావతి: గవర్నర్‌ పోస్టు అలంకారప్రాయంగా మారిందని ఇది నా వ్యక్తిగత అభిప్రాయమని రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాంలాల్‌ గవర్నర్‌గా ఉన్నపుడే గవర్నర్‌ వ్యవస్థను వ్యతిరేకించామని అన్నారు. సంవత్సరాల తరబడి ఒకే గవర్నర్‌ ఎక్కడైనా ఉంటారా..అని మంత్రి అన్నారు. కేంద్రానికి తాబేదార్‌గా ఉంటూ..కేంద్రం చేస్తున్న కుట్రకు సంధానకర్తగా ఉన్నారని, గవర్నర్‌ పదవిని కళంకితంగా మార్చారని నరసింహన్‌ తీరుపై నక్కా పెదవి విరిచారు.