నాని ‘దసరా ‘ టీజర్ ఎలా ఉందంటే..

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మాస్ ఎంటర్టైనర్ ‘దసరా’. నూతన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నాని సరసన కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తుంది. రీసెంట్ గా షూటింగ్ అంత పూర్తి చేసుకొని , పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మార్చి 30 న పాన్ ఇండియా గా పలు భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్ కార్య క్రమాలపై దృష్టి సారించారు మేకర్స్. అందులో భాగంగా ఈరోజు సోమవారం చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసారు.

ఇక టీజర్ విషయానికి వస్తే..

పది తలల రావణాసుడి కటౌట్ తో టీజర్ ప్రారంభమైనది. ఈర్లపల్లి.. సుట్టూరా బొగ్గు కుప్పలు..తొంగి జూత్తెగానీ కనిపియ్యని ఊరు.. అంటూ నాని డైలాగ్ లు టీజర్ ఫై ఆసక్తి పెంచింది. మందంటే మాకు యసనం కాదుఅలవాటు పడిన సంప్రదాయం…నీ యవవ్వ ఎట్లైతే గట్లాయె గుండు గుత్తగ లేపేద్దాం బాంచ్చెత్..’ అంటూ నాని చెబుతున్న డైలాగ్ లు.. టీజర్ లో కనిపిస్తున్న ఇంటెన్స్ మాసీవ్ డ్రామా.. బొగ్గు గనిలో పని చేసే కార్మికుడిగా నాని కనిపిస్తున్న తీరు… సినిమా ఫై అంచనాలు పెంచేసింది

పొయ్యి బుక్కెడు బువ్వతిని పండుకో పోరా… అంటూ సాయి కుమార్ చూపిస్తున్న విలనీ.. మలయాళ నటుడు షీనే గోమ్ చాకో విలనీ.. ఫస్ట్ ఫ్రేమ్ టు లాస్ట్ ఫ్రేమ్ వరకు నాని మాసిన గడ్డం లుంగీ షర్ట్ లో కనిపించిన తీరు ఇదొక ఇంటెన్స్ యాక్షన్ డ్రామా అని స్పష్టం చేస్తోంది. టీజర్ చివర్లో నాని రక్తం ఓడుతూ నోట్లో కత్తి పట్టుకుని అదే కత్తికి తన వేలిని కట్ చేసి తనకు తానే రక్త తిలకం దిద్దుకున్న సన్నివేశం ఓ రేంజ్ లో వుంది. ఓవరాల్ గా టీజర్ చూస్తుంటే సినిమా పుల్లెన్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని అర్ధమవుతుంది.

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలోని ఒక గ్రామం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుంది. నాని కెరీర్‌లో ఇది వరకు చేయని ఓ పక్కా అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమా ఇదే. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో రిలీజ్ చేయబోతున్నారు. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు సంతోష్ నారాయణ్ మ్యూజిక్ ఇస్తుండగా , సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్ గా.. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు.