నడుముపై చారలా!

Stretches
Stretches

నడుముపై చారలా!

పెట్టీకోట్‌ గాని డ్రెస్‌గాని గట్టిగా బిగించి కట్టడం వల్ల నడుము మీద నల్లగా మచ్చలు పడతాయి. ఈ మచ్చలు పోవటానికి కొన్ని చిట్కాలు మీకోసం..

నువ్వులనూనెలో పసుపు నిమ్మరసం కలిపి నడుముకు రాసి అరగంట తరువాత వేడినీళ్లతో స్నానం చేస్తే నడుము దగ్గర నలుపు పోతుంది.

నడుము దగ్గర చారకు క్లినికల్‌ మైల్డ్‌ బ్లీచ్‌ చేయించుకోండి.

తులసిరసం 250గ్రా, ఆవనూనె 250గ్రా. కలిపి కాచి నూనె మిగిలిన తరువాత కాచి వడబోసి సీసాల్లో భద్రపరచుకోండి. ఆ నూనెతో నడుముకు మసాజ్‌ చేసుకుంటే నడుము నొప్పి పోతుంది. వాతము వలన వచ్చిన నడుమునొప్పి కూడా పోతుంది.

అశ్వగంధ తైలంతో నడుముకు మసాజ్‌ చేసుకుంటే నడుముకు బలం కలుగుతుంది.

కర్బూజా గింజల పప్పును పేస్ట్‌లా నూరి నడుము దగ్గర చీర బిగించి కట్టినప్పుడు వచ్చే చర్మవ్యాధికి పేస్టును రాస్తే క్రమేపీ తగ్గుతుంది.

నడుముకు వచ్చే మొలగజ్జికి అరటిపండు తొక్క నూరి కడితే తగ్గుతుంది.

దుప్పికొమ్మును సానపై అరగదీసి ఆ గంధాన్ని నడుముకు రాస్తే నడుమునొప్పి తగ్గు తుంది. సన్నని నడుము కావాలంటే యోగాస నాలలో త్రికోణాసనం, చక్రాసనం వేయండి. ఆవ నూనెతో నడుముకు మసాజ్‌ చేసుకుని వేడి నీళ్లతో స్నానంచేస్తే నడుము సన్నబడుతుంది.