నటి శ్రీరెడ్డి సంచలన ఆరోపణ

Sri reddy
Sri reddy

హైదరాబాద్‌: నటి శ్రీరెడ్డి(శ్రీశక్తి) మరో సంచలనానికి కేంద్రబిందువైంది. ఇటీవల జరిగిన ఘటనల అనంతరం తనకు బెదిరింపు ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయంటూ ఆరోపించింది. ప్రధానంగా మెగాస్టార్‌ చిరంజీవి సోదరుడు మెగా బ్రదర్‌ నాగబాబు తనకు కాల్స్‌ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ట్వీట్టర్‌లో పేర్కొన్నారు. నాకు చాలా బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి. నాకు ఏమైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత మెగా ఫ్యామిలీదే. ఇది స్వయంగా నా స్వహస్తాలతో రాస్తున్న నా వాంగ్మూలం అంటూ ట్వీట్టర్‌లో పేర్కొన్నారు.