నటరాజన్‌కు విరామం

జట్టులోకి ఆర్‌.ఎస్‌.జగన్నాధ్‌

Natarajan-
Natarajan-

Chennai : ఇంగ్లండ్‌తో జరుగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌కు భారత యువ పేసర్‌ నటరాజన్‌ను తాజాగా విరామం ఉంచాలన్న బిసిసిఐ అభ్యర్థన మేరకు తమిళనాడు క్రికెట్‌ సంఘం అతనిని విజయ్ హజారె ట్రోఫీలో పాల్గొనే తమిళనాడు జట్టునుంచి తప్పించింది.

ఆస్ట్రేలియా పర్యటనలో ప్రతిభ చూపిన నటరాజన్‌ ఎలాంటి గాయాలపాలవకుండా బిసిసిఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆ పర్యటనలో నటరాజన్‌ టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో ఆడిన తొలి భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. నటరాజన్‌ సేవలు జాతీయ జట్టుకు అవసరమని బిసిసిఐ అభ్యర్థించినందున అతనిని తాజాగా ఉంచేందుకు రాష్ట్ర జట్టునుంచి మినహాయించినట్టు టిఎన్‌సిఎ కార్యదర్శి ఆర్‌.ఎస్‌.రామస్వామి తెలిపారు.

నటరాజన్‌ స్థానంలో ఆర్‌.ఎస్‌.జగన్నాధ్‌ను జట్టులో చేర్చుకున్నామన్నారు. ఇంగ్లండ్‌తో జరిగే అయిదు టి20 మ్యాచ్‌లలో తొలి మ్యాచ్‌ మార్చి 12న అహ్మదాబాద్‌లో జరుగనుండగా, మూడు వన్డేలలో మొదటిది పుణెలో మార్చి 23న జరుగనున్నది. ‘