నగరట్రాఫిక్‌

నగరట్రాఫిక్‌
మన జంటనగరాలలో రహదార్లు ఇరుకుకావడం, వర్షాలకు గుంతలు పడటం, వాహనదారులు ట్రాఫిక్‌రూల్సును బేఖాతరు చేయడం లాంటి కారణాలతో ప్రమాదాలు జరిగి అనేకులు మర ణించడం, క్షత్రగాత్రులు కావడం ఎక్కువైంది. ముఖ్యంగా వాహ న చోదకులు ట్రాఫిక్‌సిగ్నల్సును పట్టించుకోకుండా అతిక్రమిం చడం పరిపాటయింది. ట్రాఫిక్‌ పోలీసుల శాఖ చాలానులు రాయడం నామమాత్రంమై జేబులు నింపుకుంటున్నారని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇది నిజంకాదని ట్రాఫిక్‌ విభాగపు పోలీసు ఉన్నత వర్గాలు నిరూపించుకోవాల్సిది. వాహనదారులు రెడ్‌ సిగ్నలును అతిక్రమిస్తే మొదటిసారిగా చాలాను రాయకుండా వాహనదారుని సిగ్నలుకు పక్కన ఒకగంట నిలబెట్టాలి. ఈ దృశ్యాలను టి.విలలోచూపాలి. అదే వాహనదారుడు రెండవ సారి అతిక్రమిస్తే అతని డ్రైవింగ్‌ లైసెన్సును రద్దుకావించి ఆర్‌టి వోను రద్దుచేయాలి. అతనికి మరల జీవితకాలంలో లైసెన్సు మంజూరు చేయకూడదని ఆంక్షలు విధించాలి.ఇలా చేస్తే పోలీసులపై ఉన్న ప్రస్తుత అభిప్రాయం తొలగట మే కాక ప్రమాదాల సంఖ్య కూడా చాలా వరకు తగ్గుతుంది.
– జి .శ్రీనివాస్‌, హైదరాబాద్‌

రిజర్వేషన్లు
ఒకప్పుడు అణగారినదళితవర్గాల సముద్ధరణకు అంబేద్కర్‌ మ హశయుడు ప్రతిపాదించిన రిజర్వేషన్ల విధానం రానురాను వికృత రూపం దాల్చుతోంది. ఆయా వర్గాలలో అభివృద్ధి చెంది న వారికే ఫలాలు తిరిగి లభిస్తుండగా పేదవారు ఇంకా పేదలు గా ఉండిపోతున్నారన్న గణాంకాలు ఈ విధానాన్ని పునః సమీ క్షించాల్సిన అవశ్యకత తెలియచేస్తోంది. ఒక పర్యాయం రిజర్వే షన్ల వలన లబ్ధిపొం దినవారుతిరిగి మళ్లీలబ్ధి పొందకుండా రాజ్యాంగ సవరణ చేయడం మంచిది. ఇక కొంతశాతం రిజర్వే షన్లు కులం, మతంతో సంబంధం లేకుండా పేదరికాన్ని ప్రాతి పదికపై కేటాయించాలి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని వాగ్దానం చేస్తున్నాయి. వీటిలో పేదరి కానికే అత్యంత ప్రాధాన్యత ఇస్తే సమాజం లో ఆర్థిక అస మానతలు తొలగుతాయి.
 – సి.హెచ్‌.సాయిరుత్విక్‌ నల్గొండ

కరువు కాటకాలు
సర్వసాధారణంగా పర్యావరణంలో సమతుల్యం లోపించడం వల్ల భూగర్భజలాలు ఇంకిపోవటం, వరుణదేవుడు ముఖం చాటే యడం వల్ల దేశంలో కరువున కాటకాలు సంభవిస్తాయి. వీట న్నింటిని పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వాలు ముఖ్యంగా రైతు లను ఆదుకోవాల్సినది ఎంతైనా ఉంది.దీనితో వ్యాపారులు ఆహా ర పదార్థాలను గోడౌన్‌లలో నిల్వ ఉంచి విపరీతమైన ధరలకు అమ్మిసొమ్ము చేసుకోవడమూ సర్వసాధారణం. ఆహారపదార్థాల ను ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసే ప్రజాపంపిణీ విధా నాన్ని క్రమబద్ధీకరించాలంటే ప్రభుత్వాలు తమ ఆర్థిక నిల్వలను వ్యయపరచాల్సి ఉంటుంది.
– కె. మాధవతేజ, సికిందరాబాద్‌

అవినీతికి తావీయకూడదు
ప్రజలకు నిర్దిష్టకాలవ్యవధిలో ప్రభుత్వసేవలు అందేలా చూ డాలనే సదుద్దేశ్యంతో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో సిటిజన్‌ చార్టర్‌ను అమలు చేస్తున్నారు. కాని ఇది పేరుకు మాత్రమే. వాస్త వానికి ఎక్కడాసరిగా అమలవుతున్న దాఖలాలులేవు. ప్రభుత్వం లోని అన్నిశాఖల్లో అన్ని స్థాయిల్లో ఈ విధానం ప్రవేశపెట్టి అది కచ్చితంగా అమలు జరిగేలా చర్యలు తీసుకుంటే ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుంది. అయితే ప్రజలలో అత్యధికులకు ఈ సిటి జన్‌ చార్టర్‌పైన సరైన అవగాహన లేనందువల్లన ఆశించిన ప్రయో జనం నెరవేరడం లేదు. రవాణా శాఖలో డ్రైవింగ్‌ లైసెన్సులకు నిర్దేశించిన ఫీజులు, రెవెన్యూ శాఖలో నిబంధనల ప్రకారం ధ్రువీకరణ పత్రాలు పొందడానికి పట్టే రోజులు తదితర వివరాలు ఆయా కార్యాలయాల్లో గోడలపై ప్రదర్శించాలి.లంచాలు, అడగకూడదు, ఇవ్వకూడదు లాంటి నినాదాలు ఉండాలి. కాని ప్రభుత్వ కార్యా లయాల్లో అవి మచ్చుకైనా కన్పించటం లేదు. ఆచరణలో గుట్టు చప్పుడు కాకుండా లంచాలు, వేధింపులు షరా మామూలుగానే ఉన్నాయి. అవినీతిపరులకు తావీయకుండా నిర్దిష్ట కాలవ్యవధిలో ప్రజలకు ప్రభుత్వ సేవలు అందేలా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి.
– కామిడి సతీష్‌రెడ్డి, పరకాల, వరంగల్‌జిల్లా

తక్కువ వేతనాలతో ఇబ్బంది
నేటి పోటీప్రపంచంలో విద్యాధికులైన నిరుద్యోగులెందరో ప్రభు త్వ ఉద్యోగాలు లభించక ప్రైవేటు,కార్పొరేటు పాఠశాలల్లో ప్రైవేటు టీచర్లుగా పనిచేయాల్సి వస్తోంది. పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌, బి.ఇడి లాంటి విద్యార్హతలు,బోధనాపటిమ ఉన్నప్పటికీ ప్రైవేటు విద్యా సంస్థల్లో అతి తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారు.ప్రైవేటు స్కూళ్లపై ప్రభుత్వానికి ఎటువంటి నియంత్రణ లేదు.రాష్ట్రంలో గతపది సం వత్సరాలుగా ప్రైవేటు ఇంగ్లీషు మీడియం పాఠశాలలు పుట్టగొడు గుల్లా వెలిసాయి. ఇంకా ప్రతి సంవత్సరం స్థానికంగా కొత్త పాఠశాలలు రకరకాల పేర్లతో పుట్టుకొస్తున్నాయి.అయితే ఏళ్ల తరబడి వీటిలో పనిచేసే ఉపాధ్యాయులకు బతుకుతెరువుకు సరిపోయే వేతనాలు లభించడంలేదు. ప్రభుత్వ ఉపాధ్యాయుల కంటే మిన్న గా పనిచేస్తూ పదవ తరగతిలో రాష్ట్రస్థాయి గ్రేడింగ్‌లు తీసుకు వస్తున్నారు. అయినా ప్రభుత్వ ఉపాధ్యాయుల స్కేళ్లలో అయిదో వంతయినా వీరికి చెల్లించడం లేదు. సెలవులు కూడా తక్కువే. నెలకు మూడువేల లోపు జీతాలతో ఆర్థిక ఇబ్బందులు భరిస్తూ ఖాళీ సమయంలో ఎల్‌.ఐ.సి పాలసీలు,చిట్స్‌, లాంటి ఆర్థిక సం బంధ పనులు చేసుకుంటూ కుటుంబాలు పోషించుకుంటున్నారు. ఇకనైనా వెట్టిచాకిరి చేయించుకుంటూ తక్కువ జీతాలు చెల్లిస్తున్న ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలపై విద్యాశాఖాధికారుల చర్యలు తీసుకోవాలి. వారికి సెలవులు, ప్రావిడెంట్‌ఫండ్‌, వార్షిక ఇంక్రిమెంట్లు లాంటి సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం పూనుకో వాలి.ప్రభుత్వ ఉపాధ్యాయులకు కల్పించే సౌకర్యాలు అన్నీ కూడా ప్రైవేట్‌ ఉపాధ్యాయులకు కూడా కల్పించాలి.
– సిి.ప్రతాప్‌, శ్రీకాకుళం