నగరంలో పెరుగుతున్న గన్‌ కల్చర్‌..!

gun
gun

హైదరాబాద్‌: గత కొంత కాలంగా నగరంలో గన్‌ కల్చర్‌ పెరిగిపోతుంది, వీటతో పాటు నగరంలో హత్యలు దొంగతనాలు, దోపిడీలు, అపహరణలు, బెదిరింపులు మామూలయ్యాయి. నగరంలో గన్‌ కల్చర్‌ పెరిగి పోయింది. నేరగాళ్లు గన్‌లతో బెదిరించి ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. వీరు ఆయుధాలను ఉపయోగించేదుకు వీరికి ఎటువంటి అనుమతి ఉండదు. ఈ దందా పై గత కొద్ది రోజులుగా పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు, కాగా నేరగాళ్లు ఆయుధంతో ప్రత్యర్ధిని బయటపెట్టి తమకు కావల్సిన పనిని సులువుగా చేసుకుంటున్నారు. కాగా ఈ ఆయుధాల్ని సమకూర్చుకునేందుకు ఉత్తరాది రాష్ట్రాలకు వెళుతున్నారు. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, రాజస్ధాన్‌, మధ్యప్రదేశ్‌ లలో వీటిని కొని నగరానికి తెస్తున్నారు. కొంత మంది వ్యక్తులు నగరానికి ఆక్రమంగా గన్‌లు సరఫరా చేస్తున్నారు. ఇలా కొన్ని ఆయుధాలను ఇతరులను బెదిరించడానికి లేదా హత్యాయత్నాలకు ఉపయోగిస్తున్నారు, విక్రమ్‌గౌడ్‌ కేసులో ఇదే జరిగింది. ఇంతకు ముందు కూడ ఇలా జరిగిన సంఘటనలు అనేకం ఉన్నాయి. గల్లీలీడర్ల నుండి మొదలు పెడితే పహిల్వాన్‌ల వరకు, రౌడీలతో పాటు మరి కొంత మంది అధికార దర్పం కోసం వీటిని కొంటున్నారు. ఆయుధాల కొనుగోళ్ల కోసం ఇతర రాష్ట్రాలకు వెళుతున్నారు, వీరు నగర టాస్క్‌ఫొర్స్‌పోలీసులకు దొరక కుండా వాటిని నగరానికి తీసుకువస్తున్నారు. పోలీసులు అప్పుడప్పుడు దాడులతో వీటిని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నా వీటిపై పూర్తిగా నిఘా ఉండటం లేదు. అక్రమ ఆయుధాలంటే మొదట మనకు గుర్తుకు వచ్చే రాష్ట్రాలలో బీహార్‌ లోని గయ ,పాట్నా, రాజస్ధాన్‌ లోని జయపుర, మద్యప్రదేశ్‌ లోని ఇండోర్‌, బర్వాని, బర్వానిలో కొన్నితెగల ప్రజలు 300 సంవత్సరాలుగా తుపాకులను తయారు చేస్తున్నారు. కాలానుగుణంగా మార్పులు చేస్తు వీటిని తయారు చేస్తున్నారు. అభివృద్ది చెందిన దేశాలలో ఉపయోగించే అధునాతన గన్స్‌ను తయారు చేస్తు ఒక్కోదాన్ని 15వేలనుండి మొదలుకొని డిమాండ్‌ను బట్టి వీటిని అమ్ముతున్నారు. వీటి అవసరాన్ని బట్టి ఆయుధాలను వారే నగరానికి సరఫరా చేస్తున్నారు. దీని మూలంగా నగరంలో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో అధికారికంగా 10వేల ఆయుధాలుంటే అనధికారంగా 30వేల వరకు ఉండవచ్చని అంచనా. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో నమోదవుతున్న నేరాల సంఖ్య పెరుగుతున్నట్టు తెలిసింది. నగర టాస్క్‌ఫోర్స్‌పోలీసులు అప్పుడప్పుడు తనిఖీలు చేస్తున్న వీరు పట్టుబడట్లేదు ,పోలీసులకు అనుమానం రాకుండా హైటెక్‌ పద్దతుల్లో ,బస్సులు, రైళ్లలో, గూడ్స్‌వాహనాలలో వీటిని నగరానికి తరలిస్తున్నట్లు తెలిసింది. రైళ్లలో తనిఖీలు లేకపోవడం వీరికి వరంలా మారింది .వీరు నగర శివారు ప్రాంతాలలోని రైల్వే స్టేషన్‌లలో దిగిపొతు వాటిని నగరానికి చేర వేస్తున్నారు. బంజారా హిల్స్‌, జాబ్లిహిల్స్‌, మాదాపుర్‌ ప్రాంతాలలో కొందరు వ్యాపారులు విదేశీ తయారి గన్స్‌ను దిగుమతి చేసుకుంటున్నారు. నగర శివారులలోని రౌడీలు, గూండాలు, సంఘవిద్రోహ శక్తులకు ఆయుధాలు కొరియర్‌ల ద్వారా అందుతున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో కొంతమంది కుర్రకారు పెళ్లిళ్లల్లో ,జన్మదినం సందర్బంగా గాల్లోకి కాల్పులు జరిగిన సంఘటనలున్నాయి. ఈ ఆయుధాలు ఎవరివనేవి ఇంత వరకు కనిపెట్టలేక పోయారు. పాత బోయిన్‌పల్లిలో కాంగ్రెస్‌ లీడర్‌ ను రౌడిషీటర్‌ వెంటపడి కాల్చాడు. సికింద్రాబాద్‌ పరిధిలో ఓ ప్రత్యర్ది వర్గానికి చెందిన యువకుడిని అపహరించి డబ్బుఇవ్వకుంటే చంపుతామని పిస్తోల్‌తో బెదిరించాడు. వీటిని కంట్రోల్‌ చేయకపోతే భవిష్యత్‌ లో ఇంకెన్ని సంఘటనలు జరుగుతాయో? తాజాగా నగరంలో తుపాకులు అమ్ముతున్న ఇద్దరు ఘరానా దొంగలను పోలీసులు అరెస్ట్‌ చేశారు, రాయఘర్‌ నుంచి తుపాకులు తెచ్చి అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌, విజయవాడలలో లక్షకు ఒకటి చొప్పున విక్రయిస్తున్న ఇద్దరిని రాచకొండ ఎస్‌ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, కాగా నిందితుల నుండి 2 గన్స్‌ స్వాధీనం చేసుకున్నారు.