నఖ సౌందర్యానికి మెరుగులు

This slideshow requires JavaScript.

నఖ సౌందర్యానికి మెరుగులు

గోళ్లకి గోరింటాకు పెట్టడం ఒక ఫ్యాషన్‌, ఆరోగ్యమని భావించే రోజులు పోయాయి. చేతివేళ్లకు రకరకాల డిజైన్స్‌ మెహందీతో కాక గోళ్లకు రంగులు పులమటం, దాన్నొక కళగా మార్చటం, నేటి ట్రెండ్‌, ఇంట్లోకాక బైట స్పెషల్‌గా వీటిని వేసే కళాకారులు ఉన్నారు.

ఇంట్లో నెయిల్‌ ఆర్ట్‌ వేసుకోవాలనుకునేవారు కలర్‌ఫుల్‌ నెయిల్‌ పెయింట్‌ కాక ట్రాన్స్‌పరెంట్‌ నెయిల్‌ పెయింట్‌ టూత్‌పిక్‌, నెయిల్‌ ఆర్ట్‌ కలర్‌ పెన్ను, జీరోనెంబర్‌ పాయింటెడ్‌ బ్రష్‌, నెయిల్‌ స్టిక్కర్‌, నెయిల్‌ జ్యుయల్‌ స్టర్డ్‌, స్టోన్‌, స్టోన్‌బిళ్లలు గ్లూ కొనుక్కోవాలి.

ముందు శుభ్రంగా గోళ్లని గోరువెచ్చని నీటిలో ఉప్పు, కొద్దిగా షాంపూ వేసి ఓ పావ్ఞగంట ముంచి ఉంచాలి.

ఆపై ఫైలర్‌తో రౌండ్‌, ఫ్రెంచ్‌ లేక మీకిష్టమైన షేపులో సెట్‌ చేసి బేస్‌ ఎండాక డిజైన్స్‌ గీయాలి. బఫర్‌తో బఫ్‌ చేయాలి. ఆపై పెట్రోలియం జెల్లీ లేక క్రీం పట్టించాలి. నెయిల్‌ పెయింట్‌తో బేస్‌ వేశాక కలర్‌ఫుల్‌ స్టోన్స్‌తో డిజైన్స్‌ తీర్చిదిద్దవచ్చు. మీకిష్టమైన రంగుని గోళ్లకి వేయాలి. ఆ పై గోరు క్రింది భాగం పై స్టోన్స్‌, స్టర్డ్స్‌ని గ్లూతో అతికించాలి.

గోరు పై భాగాన ట్రాన్స్‌పరెంట్‌ క్రింద స్పార్కల్‌. నెయిల్‌ పెయింట్‌ వేసి దానిపై స్టోన్స్‌ అంటించాలి. వైట్‌ కలర్‌ నెయిల్‌ పెయింట్‌ వేస్తే సగం గోరుపై కొద్దిగా గోల్డ్‌ డస్ట్‌ చిలకరిస్తే భలేగా ఉంటుంది. ఫ్యాబ్రిక్‌ నెయిల్‌ ఆర్ట్‌లో ముందుగా, ఏదన్నా రంగుని నెయిల్‌పెయింట్‌ బేస్‌గా వేసుకోవాలి. సగం ఆరినాక దానిపై టూత్‌పిక్‌తో ఫ్యాబ్రిక్‌ కలర్‌ తీసుకుని డాట్స్‌, చెక్స్‌ లాంటివి డిజైన్స్‌ వేసుకోవచ్చు.

ఫ్యాబ్రిక్‌ కలర్‌ పూర్తిగా ఎండాక దానిపై ట్రాన్స్‌పరెంట్‌ నెయిల్‌ పెయింట్‌ వేస్తే బాగా సెట్‌ అవ్ఞతుంది. బ్రైడల్‌ నెయిల్‌ ఆర్ట్‌లో హెవీ డిజైన్సు వేసుకోవాలి. లైట్‌ కలర్‌ని బేస్‌గా వేసి, హెవీలుక్‌ కోసం బ్రైడల్‌ బిందీ, స్టోన్స్‌తో అలంకరించాలి. గోళ్లపై వైట్‌ లేక హాఫ్‌ వైట్‌ని బేస్‌గా వేయాలి. ఆపై పొడవ్ఞగా ఉండే బ్రైడల్‌ బిందీ అంటించి దానిపై ట్రాన్స్‌పరెంట్‌ నెయిల్‌ పెయింట్‌ వేయాలి.

గోరుపై వాడే స్టోన్స్‌, బిందీలు డ్రెస్సుకి మ్యాచ్‌ అయ్యేలా ఉండాలి. బిందీ అంచుల వద్ద వైట్‌ రెడ్‌, పింక్‌, గ్రీన్‌స్టోన్స్‌ అతికించాలి. గోళ్లపై చిన్నచిన్న ముత్యాలు డెకరేట్‌ చేయొచ్చు. పైన గ్లిటర్‌ వాడవచ్చు. నిప్‌నేల్‌ ఆర్ట్‌లో పెన్నుతో రకరకాల కలర్‌ ఫుల్‌ డిజైన్స్‌ గీయవచ్చు. దీనికై రంగురంగుల పెన్నుల ట్యూబ్స్‌ దొరుకుతాయి.

ముందుగా డార్క్‌ లేక లైట్‌ షేడ్‌నెయిల్‌ పేయింట్‌ బేస్‌గా వేయాలి. అది బాగా ఆరాక నెయిల్‌ ఆర్ట్‌ పెన్నుతో మీకు ఇష్టమైన డిజైన్స్‌ పళ్లు, పూలు, పక్షులు మీ ఊహని బట్టి గీసుకోండి. ఇది పెన్నులా ఎంచక్కా గీతలు గీయటానికి ఉపయోగపడుతుంది.

డిజైన్‌ పూర్తయ్యాక బాగా ఆరాక ట్రాన్స్‌పరెంట్‌ నెయిల్‌ పెయింట్‌ కోటింగ్‌ వేసి తీరాలి. స్టిక్కర్‌ నెయిల్‌ ఆర్ట్‌కి తేలిగ్గా రకరకాల డిజైన్స్‌ ఉన్న స్టిక్కర్స్‌ బజారులో లభిస్తున్నాయి. వీటిని గోళ్లపై నెయిల్‌ పెయింట్‌ బేస్‌ వేశాక అంటించుకోటమే. చాలా తక్కువ టైంలో ఆకర్షణీయమైన డిజైన్స్‌ కోసం వీటికి బోలెడంత డిమాండ్‌ పెరిగింది.

బుల్లిబుల్లి స్టార్స్‌, పూలు, కార్టూన్స్‌ డిజైన్‌ స్టిక్కర్స్‌ లభిస్తున్నాయి. స్టిక్కర్‌ కలర్‌కి భిన్నంగా బేస్‌ కలర్‌ వేసుకోవాలి గోళ్లకి. ఆ పైన ట్రాన్స్‌పరెంట్‌ నెయిల్‌ పెయింట్‌ వేయాలి.