నకిలీ దస్తావేజులతో భూకబ్జా.. అరెస్ట్‌

Arrested
Arrested

హైదరాబాద్‌: నకిలీ దస్తావేజులతో ప్రభుత్వ భూమిని కాజేసిన ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నగర శివారులో గల మేడిపల్లిలో 8మంది సభ్యుల ముఠాను యాచారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఫార్మాసిటిలో భూసేకరణలో పరిహారం కింద రూ.1.12కోట్లు ఈ ముఠా టోకరా చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ముఠాకు ప్రధాన సూత్రాధారి వనస్థలిపురం వాసి లక్ష్మీకాంతయ్యగా గుర్తించారు.