నకిలీ గర్భం-2

This slideshow requires JavaScript.

నకిలీ గర్భం-2

లక్షణాలు: 50-90శాతం మందిలో బహిష్టులు రెగ్యులర్‌గా రావడం ఉంటుంది. లేదా బహిష్టులు రావడం ఆగిపోతాయి. దీన్నే ఎమెనోరియా అంటారు. 60-90శాతం మందిలో పొట్ట ఉబ్బెత్తుగా ఉంటుంది. 50-70శాతం మందిలో కడుపులో పిండం తిరుగుతున్నట్లు ఫీలవ్ఞతారు. కాని నిజానికి వారి కడుపులో గ్యాస్‌ ఎక్కువ కావడం వల్ల అలా జరుగుతుంది. దీన్నే క్వికెనింగ్‌ అంటారు. 18శాతం మందిలో స్తనాలు బరువెక్కడం, నొప్పి, చనుమొనలు నొప్పిగా ఉండడం, ఒక్కోసారి పాలు లేదా నీళ్లువంటి పల్చటి ద్రవం స్రవించడం, వికారం, వేవిళ్లు, వాంతులవడం అనేక జీర్ణకోశ సమస్యలుంటాయి.

గర్భధారణలో ఎటువంటి లక్షణాలుంటాయో అలాంటి లక్షణాల్ని వారు అనుభూతి చెందుతారు. వారు గర్భవతులని మానసికంగా, శారీరకంగా గాఢంగా నమ్ముతారు. దీన్నే సిములేటెడ్‌ ప్రెగ్నెన్సీ అంటారు. నెలలు నిండినాయని, నొప్పులు వస్తున్నాయని (1శాతం మందిలో) హాస్పిటల్‌కు వెళ్లినపుడు అది నకిలీ గర్భమని డాక్టర్లు తప్పు చెబుతున్నారని భావిస్తారు. కొందరు రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి (నకిలీ గర్భంతో) అలాగే ప్రెగ్నెన్సీతోనే ఉన్నామనే భ్రమలో వ్ఞంటారు. కొందరు 10నెలలు అయిన కాన్పు కాలేదని, నొప్పులు ఆగి ఆగి వస్తున్నాయని డాక్టరు దగ్గరికెళ్లినప్పుడు అసలు పరిస్థితి తెలుస్తుంది. వీరు ప్రెగ్నెన్సీ అని నమ్మడమే కాకుండా అందర్ని నమ్మిస్తారు. ఇది రోగి నమ్మకంపై ఆధారపడి వ్ఞంటుంది. వాస్తవాన్ని అంగీకరించలేరు. ముట్లాగిపోయేటప్పుడు, తర్వాత హార్మోన్ల ఇంబాలెన్స్‌ వ్ఞండడం వల్ల ఇలాంటి వారిలో ఈ సమస్య ఎక్కువగా వ్ఞంటుంది. ఇది ఒక రకమైన సైకోసోమాటిక్‌ మెడికల్‌ కండీషన్‌. పరీక్షలు-చికిత్స: వీరికి వైద్యపరీక్షలు, స్కానింగ్‌, ఎక్స్‌రేలు, జననేంద్రియ పరీక్షలు చేసి గర్భం కాదనే విషయాన్ని కౌన్సిలింగ్‌, సైకోధెరపీ ద్వారా వారిలో మార్పు తీసుకొని వస్తారు. వాస్తవాన్ని వారికి తెలియచెప్పడమే కాకుండా వారు వాస్తవాన్ని గ్రహించేటట్లు వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తారు.

 

డాక్టర్‌ కె. ఉమాదేవి, తిరుపతి