నకిలీ ఇమెయిల్స్‌, వాయిస్‌కాల్స్‌పై జాగ్రత్త!

email17
email

నకిలీ ఇమెయిల్స్‌, వాయిస్‌కాల్స్‌పై జాగ్రత్త!

హైదరాబాద్‌, అక్టోబరు 16: బీమా నియంత్రణ ప్రాధికారసంస్థ (ఐఆర్‌డిఎఐ) నుంచి ఫోన్‌ చేస్తున్నా మని చెపుతూ పాలసీల విక్రయాలుచేసే మోసపూరి త కాల్స్‌పై అప్రమత్తంగాఉండాలని మాక్స్‌లైఫ్‌ ఆప రేషన్స్‌ హెడ్‌ ఇందీవర్‌ కృష్ణ వెల్లడించారు. బీమా పరంగా తమ అంశాలను పూర్తిగా పరిష్కరించేం దుకువీలుగా తాము సహకరిస్తామని చెపుతూ మోసం చేసే వీలు ఎక్కువగా మార్కెట్లలో కనిపి స్తోందన్నారు. కొన్ని సందర్భాల్లో పాలసీదారుల బీమా పాలసీ వివరాలను కూడా సంగ్రహించి వాటి ని తిరిగి పాలసీదారుల నుంచే పొందేందుకు కృషి చేస్తారన్నారు. బీమా పాలసీలను తరచూ నగదు రహిత లావాదేవీలుగా చేస్తామని చెపుతూ చెక్కు లేదా నగదు లేదా నెప్ట్‌ బదిలీద్వారా చేయవచ్చని సూచిస్తారని ఇదికూడా మోసపూరితమేనన్నారు. కొన్ని సందర్భాల్లో పాలసీదారులకు చేసిన ఫోన్‌ నంబరు కూడా కొన్ని సందర్భాల్లో మారిపోతుంద న్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి మోసపూరి త మెయిల్స్‌ 294 బిలియన్‌లకుపైగా వస్తున్నట్లు ఇందీవర్‌ కృష్ణ వెల్లడించారు. వీటిలో 90శాతం అంతా మోసం అన్నారు. అలాగే 37.3 మిలియన్ల వరకూ ఫిషింగ్‌ దాడులు ఉన్నాయని, 88శాతం లింక్‌ను క్లిక్‌చేయాలని సలహాలిస్తుంటారని ఇందీవర్‌ వ్లెడించారు. ఇలాంటి మోసపూరిత కార్యకలాపాలపై ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వెనువెంటనే న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీమా కంపెనీలకు సహకరించాలని ఆయన సూచించారు. పిషింగ్‌ లేదా విషింగ్‌ అంటే వాయిస్‌ ఆధారిత కాల్‌ వంటివాటిని ఎట్టిపరిస్థితు ల్లోను అనుమతించకూడదని ఆయన అన్నారు. హ్యాకర్లు ఇటువంటి దాడులకు ప్రోత్సాహం ఇస్తార న్నారు. బీమా కంపెనీలు కూడా తమ కస్టమర్లను తరచూ విద్యావంతులను చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. భారత్‌లో బీమారంగం క్రమబద్ధీ కరణ ఉన్న రంగంగా పేరున్నదని, ఎక్కువశాతం మోసాలకు ఆస్కారం ఉండంటంతో ప్రభుత్వపర మైన నియంత్రణ అధికంగా ఉంటుందని, అందుకే ఐఆర్‌డిఎఐ , బీమా కంపెనీలు వివిధరకాల చర్యలు చేపట్టి మోసాల కట్టడికి కృషిచేస్తాయన్నారు. అయి తే కొన్ని సమయాల్లో కొత్తకొత్త మార్గాలను కూడా ఈమోసగాళ్లు అనుసరిస్తారన్నారు. ఇటువంటి వాటి ని ప్రభుత్వం, బీమా నియంత్రణ సంస్థలు, బీమా కంపెనీలు సంయుక్తంగా అరికట్టాల్సిన అవసరం ఎంతోఉందని మాక్స్‌లైప్‌ ఇందీవర్‌ కృష్ణ పేర్కొన్నారు.