నంద్యాల సమీపంలో అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా

హైదరాబాద్ నుంచి శబరిమలకు వెళ్తున్న అయ్యప్ప స్వాముల మినీ బస్సు టెంపో ట్రావెలర్ నంద్యాల సమీపంలో ప్రమాదానికి గురైంది. నంద్యాల సమీపంలోని కానాల పల్లె మలుపు దగ్గర ఈ బస్సు బోల్తాపడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 15 మంది ప్రయాణిస్తుండగా ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ప్రమాద విషయం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకొని గాయపడిన వారిని 108 వాహనంలో నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వ ఆష్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఏడేళ్ల చిన్నారి కూడా ఉన్నారు.. ఆమెకు ఎటువంటి గాయాలు కాలేదు. డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని.. స్థానికులు అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.