నంద్యాల ఉప ఎన్నిక నేప‌థ్యంలో శిల్పా స‌హ‌కార్ మూసివేత‌

shilpa sahakar closed by nandyala by election
shilpa sahakar closed by nandyala election

కర్నూలు: నంద్యాల ఉప ఎన్నిక సంద‌ర్భంగా ప్రలోభాల‌కు పాల్ప‌డుతున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్
పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి చెందిన శిల్పా సహకార్‌ను అధికారులు మూసివేశారు. పోలింగ్‌కు
ఒకరోజు ముందు 10 శాతం రాయితీతో సరకులు విక్రయిస్తున్నారంటూ ఫిర్యాదులు రావడంతో ఈ చర్యలు
చేపట్టారు. మార్కెట్‌ ధరలకంటే తక్కువకే సరకులు విక్రయిస్తామంటూ ప్రకటించడంతో ప్రజలు పెద్దఎత్తున
త‌ర‌లి వ‌చ్చారు.