నంద్యాల ఉప ఎన్నిక కౌంటింగ్‌

evm

నంద్యాల: ఉప ఎన్నిక కౌంటింగ్‌ ప్రక్రియ సజావుగా సాగేందుకు  గట్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇటీవల నంద్యాలలో చోటు చేసుకున్న ఇరు పార్టీల ఘర్షణల నేపథ్యం లో పట్టణంతో పాటు, కౌంటింగ్‌ కేంద్రం వద్ద పోలీస్‌ బలగా లను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులను అప్రమత్తం చేశారు. ఫలితాల తర్వాత కూడా ఎటువంటి గొడవలు జరకుండా చూడాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఒక అదనపు ఎస్‌పి, 5 గురు డిఎస్‌పి లు,17 మంది సిఐలు, 38 మంది ఎస్‌ఐలు,74 మంది ఎఎస్‌ ఐలు,260 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 20 మంది మహిళా కానిస్టేబుళ్లు,44 సెక్షన్ల ఎఆర్‌ కానిస్టేబుళ్లు,10 ప్రత్యేక బృందాలు,ఒక కంపెనీ సిఆర్‌పిఫ్‌ దళం,ఐదు ప్లాటూన్ల ఎపిఎస్‌పి పోలీసులు బందోబస్తులో ఉంటారు.ఇక కౌంటింగ్ వివరాలను ఎప్పటికప్పడు రౌండుల వారీగా ఫలితాలను పోలింగ్‌ కేంద్రం ఎదుట ఏర్పాటు చేసిన ఎల్‌ఇడి స్క్రీన్‌ ద్వారా మీడియాకు, ప్రజలకు తెలియజేస్తారు.

ఓట్ల లెక్కింపు సందర్బంగా టీడీపీ, వైసీపీ నేతలు పెద్ద సంఖ్యలో నేడు నంద్యాలకు తరలి వచ్చారు. ఎన్నికల ప్రచార సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరు పార్టీల నేతలు ఇక్కడ తిష్ట వేసిన విషయం తెలిసిందే.