నంద్యాల ఉప ఎన్నిక‌ల‌ భ‌ద్ర‌త‌కు పారా మిలిట‌రీ బ‌ల‌గాలు

nandyala
nandyala

నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గ ఉపఎన్నికకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. నియోజకవర్గంలోని అన్ని కేంద్రాలకు పోలింగ్‌ సామాగ్రి తరలివెళ్లింది. పోలింగ్‌ సిబ్బంది సహా దాదాపు 6వేల మంది ఎన్నికల విధుల్లో పాలు పంచుకుంటున్నారు. రేపు ఉదయం 7 గంటలను నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. నియోజకవర్గంలోని 255 పోలింగ్‌ కేంద్రాల్లో 144 కేంద్రాలను అత్యంత సమస్మాత్మకంగా, 71 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. నియోజకవర్గం మొత్తం దాదాపు సమస్యాత్మకంగా ఉండటంతో ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి పోలింగ్‌ కేంద్రాన్ని పారామిలటరీ బలగాలకు అప్పగించనున్నారు. ఇప్పటికే 6 కంపెనీల కేంద్ర పోలీస్‌ బలగాలు నంద్యాలకు చేరుకున్నారు.