నంద్యాల‌లో ప్ర‌చారానికి వ‌చ్చిన జ‌లీల్‌ఖాన్‌

tdp mla jalil khan
tdp mla jalil khan

నంద్యాలః బీకామ్ లో ఫిజిక్స్’ అంటూ సోషల్ మీడియాలో ఫేమ‌స్‌ అయిన తెలుగుదేశం నేత జలీల్ ఖాన్,
నంద్యాలలో ప్రచారానికి వచ్చారు. నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు తెలుగుదేశం జలీల్
ఖాన్ ను రంగంలోకి దించగా, జలీల్ ను చూసేందుకు ఓటర్లు ఉత్సాహం చూపిస్తున్నారు. ‘బీకామ్ లో ఫిజిక్స్’
అన్న పదం ప్రజల నోళ్లల్లో నానిపోవడంతో, ‘ఈయనే ఆ మాటన్నది’ అంటూ జలీల్ ప్రచారం చేస్తున్న ప్రాంతాల్లో
ఆయన్ను చూసేందుకు జ‌నం వస్తున్నారు. ఇక ప్రజల ఉత్సాహం చూసిన జలీల్ సైతం సరదాగా వారితో మాట్లాడుతూ,
మైనారిటీలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని కోరారు. అయితే తెలుగుదేశం సైతం జ‌లీల్ ప్ర‌చారం ద్వారా
ముస్లిం ఓట్లు రాబ‌ట్టాల‌ని చూస్తోంది.