నంద్యాలలో డబ్బుల పంపిణీ జరుగుతోంది.

Somireddy
SOMIREDDY CHANDRAMOHAN REDDY

నంద్యాల: ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే వైఎస్సార్‌సీపీ ప్రలోభాలకు సిద్ధపడుతున్నారని టీడీపీ ఆరోపించింది. నంద్యాలలో శుక్రవారం ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిన వారంతా వైఎస్సార్‌సీపీకి చెందినవారేనని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి చెప్పారు. నంద్యాలలో పార్టీ కార్యాలయంలో ఎంపీ జెసీ దివాకర్‌రెడ్డి కలిసి మీడియాతో మాట్లాడారు. జగన్‌ తన జీవిత కాలంలో సీఎం కాలేరని ఎద్దేవా చేశారు. ప్రజల్ని మభ్య పెట్టడంలో ప్రథముడు. ఆ పార్టీ నేతలు బొత్స, మిథున్‌రెడ్డిల సారథ్యంలో డబ్బు పంపిణీ కొనసాగుతోందని ఆరోపించారు.విచ్చలివిడిగా డబ్బులు పంపిణీ చేస్తూ దొరికిపోతూ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.