ధ్యానం

ధ్యానం

Meditation
Meditation

మానసిక వత్తిళ్లను తట్టుకునే సాధనంగా ప్రాచుర్యం పొందింది. మానసిక రుగ్మతలను నయం చేయడమే కాకుండా, ఇతరత్రా స్వస్థత చేకూర్చే అంశాల పరిధిలోకి మెడిటేషన్‌ చేరింది. దీనితోపాటు రిలాక్సేషన్‌ ప్రక్రియలు కూడా ఈ పరిధిలోకి చేరాయి. మెడిటేషన్‌ మెద డు, శరీరాలపై ప్రభావాన్ని చూపి తగిన సత్ఫలితాలని స్తుంది. మానసిక వత్తిడిని తట్టుకోగలిగే సామర్థ్యాల స్థాయిని తగ్గించే హార్మోన్ల ఉత్పత్తిని అరికట్టడంలో మెడిటేషన్‌ ఎంతో ఉపకరిస్తుంది. అనేక సందర్భాల్లో అటువంటి హానికర హార్మోన్ల ఉత్పత్తి జరిగి శరీరం అనేక రోగాల బారిన పడే అవకాశం ఉంది. మెడిటేషన్‌, రిలాక్సేషన్‌ ప్రక్రి యలు సాధన చేయడం ద్వారా శరీరంలోనూ, మెదడులోనూ కలతలు, దిగులు, భయాం దోళనలు తగ్గి, ఇతర శారీరక బాధలనుంచి కూడా విముక్తి కలుగుతుంది. మెడిటేషన్‌ ప్రక్రియలు అనేక రకాలుగా ఉన్నప్ప టికీ, ప్రధానంగా కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మనం ఇక్కడ పరిశీలిద్దాం. నిశ్శబ్ద వాతావరణంలో నిర్వహించే మెడిటేషన్‌ ప్రక్రియలు అనేక ఆటంకాలను, అవరోధాలను నిరోధించి, మంచి ఫలితాలను అందజేస్తా యనడం లో ఎలాంటి సందేహం లేదు. మెడిటేషన్‌ చేయడానికి ఎటువంటి ఆటంకాలు, అవరోధాలు కలుగ కుండా ఉండే సమయాన్ని ఎంచు కోవాలి. ఆ సమయంలో ఆటంకం కలిగించే టెలిఫోన్‌ వంటి పరికరాలను ఆఫ్‌ చేసి ఉంచాలి. మెడిటేషన్‌ నిర్వహించదలచుకున్న గదిలోకి ఎవరూ రాకుండా చూసుకోవాలి. వీల యితే ‘డిస్ట్రబ్‌ చేయ వద్దని తలుపు పై రాసి ఉంచాలి. అయినా సంపూర్ణ నిశ్శబ్ద వాతావరణం ఏర్ప రచుకోవడం కష్టమే. తలుపులు గట్టిగా మూసుకున్నప్పటికీ, మరెన్నో శబ్దాలు మనం మెడిటేషన్‌ నిర్వ హించే గదిలోకి చొరబడి నిశ్శబ్ద వాతావరణాన్ని భంగపరచవచ్చు. వాటిని అరికట్టడం అసాధ్యం. కనుక అటువంటి సాధారణ వాతా వరణంలో మెడిటేషన్‌ సాధన చేయడం అలవర్చుకోవాలి. అప్పుడే మీరు మెడి టేషన్‌కు సరైన నిర్వచనం కలిగించినట్లవుతుంది. సౌకర్యంగానూ, సౌలభ్యంగానూ ఉండే శరీర పద్ధతుల్లో చెప్పుకో దగినది నేలమీద పడుకుని రిలాక్సేషన్‌ ప్రక్రియల ద్వారా మెడిటేషన్‌ నిర్వహిం చండం. అయితే ఈ పద్ధతిలో మెదడు కు, శరీరానికి అనుకూలమైన విశ్రాంతి లభించి, నిద్ర స్థాయికి చేరుకునే పరిస్థితి ఏర్పడవచ్చు. దీనిని నివారించాలంటే నేల మీద కూర్చుని నిర్వహించే ప్రక్రియ లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే కూర్చుని నిర్వహించే పద్ధతిలో మెదడు చురుకుగా ఉండి, మన చెప్పుచేతల్లో ఉంటుంది. సౌకర్యంగా ఉండే పద్ధతిలో కూర్చోవాలి. ప్రారంభదశలో కనీసం 10 నిము షాల మెడిటేషన్‌ నిర్వహించేలా అల వాటు చేసుకోవాలి. మెడిటేషన్‌ సమ యంలో కళ్లను మూసుకుని, ఏదేని ఒక కేంద్రబిందువుపై దృష్టిని నిలపడం అలవాటు చేసుకోవాలి. మెదడు కేంద్రీకరణ మెడిటేషన్‌ ప్రక్రియలు మొదలుపెట్టే వ్యక్తులు లేదా ప్రారంభకులు ఉఛ్వాస నిశ్వాస క్రియలో శ్వాసను బైటికి విడిచిపెట్టే సమయంలో ఏదో ఒక చిన్న అంశాన్ని ఎంచుకుని దానిని ఉచ్ఛరిస్తుండాలి. మనంచేసే దైనందిన ప్రార్థనలోని ఒక భాగాన్ని లేదా మనకు ఇష్టమైన ఏదోఒకపద్యభాగాన్ని ఎన్నుకుని దానిని పదేపదే ఉచ్ఛరిస్తుండాలి. ఇలా ఎన్నుకునే పద్యం లేదా పదం సులువుగా ఉచ్ఛ రించడానికి అనువుగా ఉండి, మానసికోల్లాసాన్ని కలిగించేలా ఉండాలి. ఏకాగ్రత, సుప్తావస్థలో ఆ భాగం లేదా మంత్రం మెదడుపై తన ప్రభావాన్ని చూపి, శారీరక, మానసిక రుగ్మతలను నయం చేయడానికి దోహదకారిగా ఉంటుంది. ట్రాన్స్‌డెన్స్‌, సుప్తావస్థల స్థాయికి ఎదగడం ఒక అద్భుతమైన మానసిక స్థాయి. ఆ స్థాయిని చేరుకోవడానికి జరిపే ప్రక్రియలు నిజమైన సాధనా లుగా చెప్పవచ్చు. ఒకసారి ఆ స్థాయికి చేరుకుంటే నిజజీవితంలో సంభ వించే ఎన్నో వత్తిళ్ల బారినుంచి మనను మనం కాపాడుకున్నట్లే. ఆ స్థాయి ఎంతో ఉన్నత స్థితికి తీసుకువెళ్లి, ఆధ్యాత్మిక సాధనలో కూడా చేరవలసిన గమ్యాన్ని చేర్చి తగిన సత్ఫలితాలను అందజేస్తుంది. మెడిటేషన్‌ ప్రక్రియలో మొదట ఒక నిముషం శారీరక రిలాక్సేషన్‌, శ్వాస నియబద్ధతతో ప్రారంభమై కొనసాగుతుంది. శరీరాంగాలను త్వరి తంగా రిలాక్సేషన్‌స్థాయిలో ఉంచి, కొన్ని ఉఛ్వాస నిశ్వాస ప్రక్రియలను నియంత్రించి శరీరంలో ఏర్పడే జీవ రసాయన చర్యలను అదుపులోకి తెచ్చి వర్తమాన కాలస్థాయిలోకి మనస్సును, శరీరాన్ని స్వాధీనం చేయాలి. జీవితంలో వ్యతిరేక భావం, పరిస్థితులను సరిగ్గా అవగాహన చేసుకోలేక పోవడం వలన ఎన్నో విపరీత పరిణామాలు ఏర్పడి అనర్థాలు జరుగుతుంటాయి. అయితే నిత్యం సాధన చేస్తుంటే అటువంటి పరిస్థితు ల ప్రభావాలకు లోనవకుండా, దూరంగా ఉండవచ్చు. మనస్సు మెదడు చెప్పుచేతల్లో ఉండకుండా, అటూఇటూ, మరెటో తిరుగుతుంటుంది. మనస్సు ఎక్కడికోపోయి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఏకాగ్ర తతో మెడిటేషన్‌ సాధన చేస్తూ మనస్సును నిలకడగా ఉంచుకోవచ్చు. పట్టు విడకుండా నిరం తరం మెడిటేషన్‌ సాధన చేస్తే ఎటువంటి సమస్య లనయినా ఎదుర్కొని, జీవితంలో అభివృద్ధిపథంలో నడవవచ్చు.