ధోనీ సేన ఘన విజయం

 

stda 1

పెర్త్‌: వెస్ట్రన్‌ ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా 64 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది.కాగా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఇక్కడ జరిగిన రెండవ వార్మప్‌ మ్యాచ్‌ లోనూ ధోనీ నేతృత్వంలోని టీమిండియా గెలుపొందింది.టీమిండియా విసిరిన 250 పరుగు టార్గెట్‌ను చేధించే క్రమంలో వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా తడబడింది.కార్డర్‌ 45 పరుగులు,జోరాన్‌ మోర్గాన్‌ 50 పరుగులు మినహా మిగతా ఎవరూ ఆడలేకపోవడంతో యువ ఆసీస్‌ జట్టు 49.2 ఓవర్లలో 185 పరుగులకే చాపచుట్టేసింది.టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా,రిషి ధవన్‌,అశ్విన్‌,అక్షర్‌పటేల్‌లకుఉ ఒక్కొక్కరికి రెండు వికెట్లు లభించగా,ఉమేష్‌ యాదవ్‌,గుర్‌ కీరత్‌ సింగ్‌లకు చెరొ వికెట్‌ దక్కింది.అంతకు ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా 49.1 ఓవర్లలో 249 పరుగులకు పరిమితమైంది.కాగా మొదట్లోనే ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ 4 పరుగులు,విరాట్‌ కోహ్లీ 7 పరుగులకే ఔట్‌ కావడంతో కష్టాల్లో పడినా రోహిత్‌ శర్మ-అజింక్యా రహానేల జోడీ ఇన్నింగ్స్‌ మరమ్మత్తు చేపట్టింది.కాగా రహానే 41 పరుగులు మూడవ వికెట్‌ రూపంలో పెవిలియన్‌కు చేరడంతో టీమిండియా మరోసారి తడబడినట్లు కనిపించింది.కాగా రోహిత్‌ శర్మ 82 బంతులు ఆడి 6 బౌండరీలు,3 సిక్సర్లతో 67 పరుగులు,మనీష్‌ పాండే 59 బంతులు ఆడి 3 బౌండరీలతో 58 పరుగులు చేసి ఆకట్టుకోవడంతో గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగింది.టీమిండియా మిగతా ఆటగాళ్లలో జడేజా 26 పరుగులతో ఫర్వాలేదనిపించినా,ధోనీ 15 పరుగులు,గుర్‌కీరత్‌సింగ్‌ 6 పరుగులు,అశ్విన్‌ 4 పరుగులతో నిరాశపరిచాడు.