ధోనీ గేమ్‌ ఛేేంజర్‌ కాదు

 

dhoni
dhoni

ధోనీ గేమ్‌ ఛేేంజర్‌ కాదు

న్యూఢిల్లీ: భారత జట్టు కెప్టెన్‌గా మహేంద్ర సింగ్‌ ధోనికి తిరుగులేని రికార్డు ఉంది. ప్రపంచంలో ఏ కెప్టెన్‌కు సాధ్యంకాని రీతిలో టీ20, వన్డే ప్రపం చకప్‌లతో పాటు ఛాంపియన్స్‌ ట్రోఫీని కూడా గెలిచాడు. కెప్టెన్‌గా బెస్ట్‌ ఫినిషర్‌గా భారత్‌కు వరుస విజయాలు అందించిన ధోనీ అంటే క్రికెట్‌ అభిమానుల్లో భారీ క్రేజ్‌ ఉంది. సచిన్‌ తర్వాత ఎక్కువగా ఆదరణ పొందిన క్రికెటర్‌ మహీనే. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ధోని టీ20 నుంచి వైదొలగాలని మాజీలు సూచిస్తు న్నారు. పొట్టి ఫార్మట్‌ నుంచి మహీ తప్పుకో వాలని, యంగ్‌ ప్లేయర్స్‌కు అవకాశం ఇవ్వాలని సలహా ఇస్తున్నారు.

తాజాగా మాజీ క్రికెటర్‌ సంజ§్‌ు మంజ్రేకర్‌ ధోనిపై ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. క్రికెట్‌ హీరోలను దేవుళ్లుగా ఆరాధి స్తున్నాం. ఇది భారత డిఎన్‌ఏలోనే ఉందా? క్రికెట్‌లో ఇప్పటికే ఒక దేవుడు ఉన్నాడు. కాబట్టి ధోని మరేదో అవుతాడని మంజ్రేకర్‌ మాజీ కెప్టెన్‌ను విమర్శించాడు. ప్రతిష్ట లేదా స్థాయి కారణంగా ఆటగాడ్ని జట్టులోకి ఎంపిక చేయొ ద్దు. ప్రతి ఆటగాడి విషయంలో ఒకే విధానం అనుసరించాలి. గతంలో బాగా రాణించడం, క్వాలిటీ లాంటి అంశాలను లెక్కలోకి తీసుకోవాలి. ఆటగాళ్లను ఎంపిక చేసేటప్పుడు నైపుణ్యాలు, ఫిట్‌నెస్‌, జట్టులో ఇమిడిపోయే త త్వం, నిలకడగా ఆడటం లాంటి అంశాలనే నేను పరిగణనలోకి తీసుకుంటానని మంజ్రేకర్‌ తెలి పాడు.

మైదానంలో ధోని ఆటతీరు పరిశీలిస్తే, గతంలో మాదిరిగా అతడెంత మాత్రం గేమ్‌ చేంజర్‌ కాదు. గొప్ప ఆటగాడు మన అంచనాలను అందుకోకపోతే తప్పించడం కూడా సరికాదా అని మంజ్రేకర్‌ ప్రశ్నించాడు. గొప్ప ఆటగాళ్ల గురించి మంచి విషయాలే ప్రస్తా వించాలా అంటూ మహీ ఆటతీరును గురించి ప్రశ్నలు గుప్పించాడు. ధోని పబ్లిక్‌ పర్ఫార్మర్‌. అతడి వ్యక్తిగత జీవితాన్ని విమర్శించడం లేదు కదా. జనం కోసం ఆడుతున్నప్పుడు ఎవరైనా విమర్శిస్తారు అని మాజీ క్రికెటర్‌ తెలిపాడు. గతంలో కపిల్‌ దేవ్‌ విషయంలో ఇలాగే జరి గింది. కపిల్‌ చివరి 25 ఇన్నింగ్స్‌ల్లో 26 వికెట్లు మాత్రమే తీశాడు. అతడ్ని తప్పించడం వల్ల జవగళ్‌ శ్రీనాథ్‌ లాంటి యువ క్రికెటర్‌ వెలుగు లోకి వచ్చాడని మంజ్రేకర్‌ తెలిపాడు.