ధోనీని కెప్టెన్‌గా ఎలా గుర్తించానంటే..

SACHIN-DHONI
SACHIN-DHONI

ధోనీని కెప్టెన్‌గా ఎలా గుర్తించానంటే.. ఇన్నాళ్లకు వెల్లడించిన సచిన్‌

న్యూఢిల్లీ: మహేంద్ర సింగ్‌ ధోనీ, భారత క్రికెట్‌కు పరిచయం అక్కర్లేని పేరు. కెప్టెన్‌గా భారత్‌కు రెండు ప్రపంచకప్‌లు అందించిన ఏకైక కెప్టెన్‌. అంతేకాదు తన క్రికెట్‌ కెరీర్‌లో అటు కెప్టెన్‌గా ఇటు వికెట్‌ కీపర్‌గా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. అలాంటి ధోని గొప్ప కెప్టెన్‌ అవుతాడని అందరికంటే ముందు ఊహించింది మాత్రం క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ టెండూల్కరే. ధోనిని టీమిండియా కెప్టెన్‌గా ఎంపిక చేయాలని బిసిసిఐకి సిఫారసు చేసింది సచినే అన్న సంగతి తెలిసిందే.

ధోనిలో ఓ కెప్టెన్‌కు కావాల్సిన అన్ని లక్షణాలను తాను ఎలా కనిపెట్టాననే విషయాన్ని తాజాగా సచిన్‌ వెల్ల డించాడు. గౌవర్‌ కపూర్‌ నిర్వహించే వెబ్‌ సిరీస్‌ ీబ్రేక్‌ ఫాస్ట్‌ విత్‌ ఛాంపియన్స్‌ అనే కార్యక్రమానికి హాజరైన సచిన్‌…ధోని వికెట్‌ కీర్‌గా ఉన్న సమ యంలో అతడితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసు కున్నాడు. నేను స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేసే సమయంలో ఫీల్డింగ్‌ పొజిషన్స్‌ గురించి కొన్ని ఆలోచలను ధోనితో పంచుకునే వాడినని సచిన్‌ అన్నాడు. తొలుత నా అభిప్రాయం చెప్పేవాడని, ఆ తర్వాత ధోని తన అభిప్రాయాన్ని చెప్పేవాడు. ఈ సం దర్భంగా ధోనీ గొప్ప కెప్టెన్‌ అయ్యే లక్షణాల ున్నాయని గమనించానని సచిన్‌ వివరించాడు. మీరు కెప్టెన్సీ కోసం ఇంటర్వ్యూ చేస్తున్నారనే విషయం ధోనీకి అప్పుడు తెలిసుండదంటూ గౌరవ్‌ చమత్కారంగా బదులిచ్చాడు. సచిన్‌ సలహా మేరకు 26ఏళ్ల వయసులో ధోని టీమిండియా కెప్టెన్‌ అయ్యాడు. భారత్‌కు తిరుగులేని విజ యాలు అందించడంతోపాటు టెస్టుల్లో అగ్రస్థానం లో నిలిపాడు.

కెప్టెన్సీ బాధ్యతలు చేప్టిన అనం తరం ధోనీ నాయకత్వంలోని భారత జట్టు 2007 లో జరిగిన ఐససి వరల్డ్‌ టీ20ని నెగ్గింది. ఆ తర్వాత 2011లో ఐసిసి వన్డే ప్రపంచ కప్‌. 2013లో జరిగిన ఛాంపియన్స్‌ట్రోఫీని ధోని సేన గెలవడాన్ని మనం చూశాం. అంతేకాదు వికెట్‌ కీపర్‌గా కూడా ధోని తన కెరీర్‌లో అత్యున్నత స్థాయికి చేరుకున్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్‌ కీపర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఇక, బ్యాటింగ్‌ విషయానికొస్తే గొప్ప ఫినిషర్‌గా ధోనికి పేరుంది. అలాంటి ధోని 2014లో టెస్టు క్రికెట్‌ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత 2017లో పరిమత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకుని మూడు ఫార్మట్లలో విరాట్‌ కోహ్లీకి కెప్టెన్సీ పగ్గాలు అప్ప గించాడు. ప్రస్తుతం జట్టులో ఆటగాడిగా కొనసా గుతున్నాడు.