ధోనీతో జాగ్రత్తగా ఉండాలి

Dhoni
Dhoni

ధోనీతో జాగ్రత్తగా ఉండాలి –
పాక్‌ మాజీ ఆటగాడు అమీర్‌ సోహైల్‌

న్యూఢిల్లీ: టీమిండి యాతో జరిగే మ్యా చ్‌లో పాక్‌ ఆటగాళ్లు మాజీ కెప్టెన్‌ మహేం ద్రసింగ్‌ ధోనితో జాగ్రత్తగా ఉండా లని పాక్‌ మాజీ ఆట గాడు అమీర్‌ సోహౖల్‌ ఆ జట్టుకి హెచ్చరిం చాడు.ఐసిసి ఛాం పియన్స్‌ ట్రోఫీలో భాగంగా తొలి మ్యా చ్‌లో టీమిండియా జూన్‌ 4న తన చిర కాల ప్రత్యర్థి పాక్‌తో తలపడనుంది. కెప్టె న్‌గా వికెట్‌ కీపర్‌గా ధోని సామర్థ్యాన్ని సొహైల్‌ ప్రశంసించాడు. మ్యాచ్‌ గతిని మార్చడంలో ధోనికి సాటి ఎవరూ లేవంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. ధోని విషయంలో పాక్‌ ఆటగాళ్లు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సొహైల్‌ స్పష్టం చేశాడు. పరిమిత వనరులతోనే మహీ మ్యాచ్‌లను గెలిపించిన సందర్భాలు అనేకం. అతను ఎప్పటికీ మ్యాచ్‌ విన్నరే అన్నారు.

ధోని విషయంలో పాక్‌ జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎందుకంటే అతని ప్పటికీ ప్రమాదకర ఆటగాడేనన్నారు. ధోని ప్రమాదకర బ్యాట్స్‌మెన్‌ అనే సంగతి గుర్తుపెట్టుకుని ఆడండి అని పేర్కొన్నారు. ధోని బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా వికెట్‌ కీపర్‌గా కూడా అనేక మ్యాచ్‌లను గెలిపించిన విషయాన్ని సొహైల్‌ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ధోని క్రీజులో కుదురుకుంటే మ్యాచ్‌ను తమవైపుకు లాగేసుకుంటాడనడంలో ఎటువంటి సందేహం లేదని పేర్కొన్నాడు. మరోవైపు హర్భజన్‌ సింగ్‌ సైతం మహీపై ప్రశంసలు కురిపించాడు. ధోనీ కేవలం బ్యాట్స్‌మెన్‌గానే కాడు వికెట్‌ కీపర్‌, నాయకుడిగానూ మ్యాచ్‌లు గెలిపాస్డాడు అని అన్నారు. అయితే ధోని, యువరాజ్‌ గతంలో మాదిరిగా ఎక్కువ సేపు క్రీజు లో నిలబడలేపోతున్నారని భజ్జీ అన్నాడు. 20-25 బంతులాడి పుంజుకుంటే మాత్రం పరుగుల వరద ఖాయమని హర్భజన్‌ సింగ్‌ పేర్కొన్నాడు.