ధోనీతో కొన్ని అభిప్రాయ భేదాలు నిజమే: గంభీర్‌

Sr
Gamhir with Dhoni

ధోనీతో కొన్ని అభిప్రాయ భేదాలు నిజమే: గంభీర్‌

 

న్యూఢిల్లీ: టీమిండియా వన్డే,టి20 కెప్టెన్‌ ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓపెనర్‌ గంభీర్‌ అభిమానులతో పంచుకున్నాడు. కాగా తనకు ధోనీకి ఎలాంటి శతృత్వం లేదని పేర్కొన్నాడు. ఫేస్‌బుక్‌లో అభిమానులతో ముచ్చటించిన గంభీర్‌ పలు ఆసక్తి కరమైన అంశాలను వారితో చర్చించాడు.నాకు ధోనీకి మధ్య ఎలాంటి శతృత్వం లేదు.మేం టీమిండియా తరుపున ఆడుతున్నా మంటే విభేదాలను పక్కన పెట్టి టీమిండియాను గెలిపించాలన్నదే మా ఏకైక టార్గెట్‌ ఉంటుంది అని గంభీర్‌ పేర్కొన్నాడు. ధోనీతో తనకు కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు ఉండేవని అంగీకరించాడు.ఒక కుటుం బంలో ఉన్నప్పుడు, లేదా ఒక గ్రూపులో ఉన్న ప్పుడు అభిప్రాయ బేధాలుఉంటాయి.నా దృష్టిలో ధోనీ మెరుగైన ఆటగాడు మంచి మనిషి అని వివరించాడు. కాగా 2011 ప్రపంచ కప్‌, 2017 టి20 ప్రపంచ కప్‌లను భారత్‌ గెలుచు కోవడం తన జీవితంలో మరిచిపోలేని క్షణాలని పేర్కొన్నాడు. ఇటీవల ధోనీ బయోపిక విడుదల సందర్భంగా గంభీర్‌ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. క్రికెటర్లపై బయోపిక్‌లు అవసరం లేదని,క్రికెటర్ల కంటే దేశానికి సేవ చేసిన వారే బయెపిక్‌లకు అర్హులని వ్యాఖ్యానించాడు. జాతి కోసం పాటుపడిన వారు ఎందరో ఉన్నారని,వారి జీవితాల పైనే బయోపిక్‌లు తీయాలని సూచించాడు.