ధోని లేని క్రికెట్‌…ఆ ఊహే కష్టం

ICC
ICC

దుబాయ్‌: ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసిసి) టీమిండియా మాజీ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ ఎంఎస్‌ ధోనిపై ఈ మధ్య కాస్త అభిమానం ఎక్కువగానే చూపిస్తున్నది. ఈ మధ్య ఐసిసి ట్వీట్లలో తరచూ ధోని పేరు వినబడుతుంది. మొన్న ధోని వికెట్ల వెనకాల నిల్చుంటే..క్రీజు వదిలే ధైర్యం చేయకండి అంటూ ప్రత్యర్ధులను హెచ్చరించింది. తాజాగా అతనిపై మరో ట్వీట్‌ చేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌ ధోనికి 300వది. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌ ప్లేయర్‌ అతడు. ఐసిసి వరుసగా అన్ని విషయాలపై ట్వీట్లు చేసుకుంటూ పోతుంది. ఇందులో ధోనిని ప్రత్యేకంగా ప్రస్తావించింది. ధోని లేని క్రికెట్‌ ఎలా ఉంటుందో.., ఆ ఊహే చాలా కష్టంగా ఉంటుంది…మిమ్మల్ని స్టంప్‌ లేదా క్యాచ్‌ ఔట్‌ చేయడానికి ఎవరూ ఉండరు..మీతో పరిహాసాలు ఆడటానికి ఎవరూ ఉండరు అంటూ ఐసిసి ట్వీట్‌ చేసింది. ఇది ధోని అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నది.

M S DHONI